విశాఖపట్నం
అల్లూరి వర్ధంతి సందర్బంగా విశాఖలో క్షత్రియ కళ్యాణ మండపంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు రోజా, అమరనాథ్, ఎంపీ ఎంవివి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అల్లూరి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు.అల్లూరి సీతారామరాజు కుటంబ సభ్యులను సన్మానించారు మంత్రులు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడ గడ లాడించిన వీరుడు అల్లూరి సీతారామరాజు ... గిరిజనుల అజమాయిషీని ఎదురించి దైర్యంగా పోరాటం చేసిన వీరుడు అల్లూరి అని కొనియాడారు.అల్లూరి 125 వ జయంతి ఉత్సవాలను దేశ వ్యాప్తంగా జరుపుతామని తెలిపారు.భీమవరంలో వచ్చే నెలలో జరిగే అల్లూరి కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారని చెప్పారు.మంత్రి రోజా మాట్లాడుతూ స్వాతంత్ర్య కోసం పోరాడిన ఎంతో మందిలో అల్లూరి సీతారామరాజు ఒకరని,రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడా లాడించారని అన్నారు.అల్లూరి సీతారామరాజు భారత దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిసిపోతారని అన్నారు.