YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ గూటికి రమణ

టీడీపీ గూటికి రమణ

కాకినాడ, మే 9,
వైఎస్సార్‌సీపీ నేత బొడ్డు వెంకటరమణ టీడీపీలో చేరారు. కాకినాడ జిల్లా అన్నవరం వన్ కన్వెన్షన్ వెంకటరమణకు అధినేత చంద్రబాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటూ పలువురు అనుచరులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీలో చేరడం ఆనందంగా ఉందన్నారు వెంకటరమణ. కాకినాడ జిల్లాలో పార్టీ బలోపేతం కోసం పనిచేస్తానన్నారు.బొడ్డు వెంకట రమణ దివంగత నేత, సీనియర్‌ రాజకీయవేత్త బొడ్డు భాస్కర రామారావు కుమారుడు. వెంకటరమణ 2014లో రాజమండ్రి నుంచి వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వెంకట రమణ తండ్రి భాస్కర రామారావు మరణం తర్వాత రాజకీయాలు పక్కన పెట్టేశారు. ఇప్పుడు రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అవ్వాలని భావించారు.కొద్దిరోజుల క్రితం వెంకటరమణ అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఫైనల్‌గా టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా టీడీపీ గెలుపు కోసం పనిచేస్తానని ఆయన చెబుతున్నారు. వెంకటరమణ రాకతో పెద్దాపురం నియోజకవర్గంలో టీడీపీ బలోపేతం అవుతుందంటున్నారు. ఈ నియోజకవర్గం నుంచి మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్నారు.మాజీ మంత్రి చిన రాజప్ప, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిలు వెంకటరమణను వెంటబెట్టుకుని టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. వెంకట రమణ పార్టీలో చేరేందుకు సముఖత చూపించగా.. అధినేత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాస్తవానికి ఈ నెల 3న పార్టీలో చేరాలని భావించారు.. కానీ కొన్ని కారణాలతో వాయిదా పడింది. ఇప్పుడు బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చిన చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికల కోసం టీడీపీ ఇప్పటి నుంచే కసరత్తులు మొదలు పెట్టినట్లు కనిపిస్తోంది. అందుకే వెంకటరమణ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాల్లో ఒకదాని నుంచి బరిలోకి దింపే అవకాశం ఉందని స్థానికంగా చర్చ జరుగుతోంది.రాజమండ్రి, కాకినాడ లోక్‌సభ స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల విషయంలో క్లారిటీ లేదు. రాజమండ్రి నుంచి 2019 ఎన్నికల్లో పోటీచేసిన మాగంటి రూప పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.. ఇటు కాకినాడ నుంచి పోటీచేసిన చెలమలశెట్టి సునీల్ వైఎస్సార్‌సీపీలో చేారారు. ఈ రెండు స్థానాల్లో ఏదో ఒకచోట పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. లేకపోతే ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపే అవకాశాలు లేకపోలేదు. వెంకటమరణ తండ్రి భాస్కర రామారావు సీనియర్ రాజకీయనేతగా సుపరిచతమైన వ్యక్తి.. కాబట్టి అది వెంకటరమణకు కలిసొచ్చే అవకాశం ఉంది

Related Posts