YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మాదక ద్రవ్యాల గుట్టు రట్టు

మాదక ద్రవ్యాల గుట్టు రట్టు

విశాఖపట్నం,
విశాఖలో పెంటాజోసైన్ ఇంజెక్షన్ల దందా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ కు  చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నాలుగు ఇంజెక్షన్ల బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. వీరు ఒక్కో ఇంజెక్షన్ ను  రూ.4000కు విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. విశాఖలో మత్తు ఇంజెక్షన్ల దందా జోరుగా జరుగుతోంది. వారంలో రెండోసారి మత్తు ఇంజెక్షన్లను పట్టుకున్నారు పోలీసులు. విశాఖ లీలా మహాల్ , భీమిలి ప్రాంతాల్లో పెంటాజోసైన్ ఇంజెక్షన్లను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరిద్దరూ వెస్ట్ బెంగాల్ కు చెందిన వారిగా గుర్తించారు. ఖరగ్పూర్ నుంచి 1300 రూపాయలకు బాక్స్ కొనుగోలు చేసి విశాఖలో 6000కు అమ్ముతున్నట్లు పోలీసులు తేల్చారు. మత్తు కోసం యువత విచ్చలవిడిగా ఈ ఇంజెక్షన్ ను వినియోగిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. సర్జరీ అయిన రోగులకు మత్తు ఇచ్చేందుకు ఈ పెంటాజోసైన్ ఇంజెక్షన్లను వినియోగిస్తుంటారు వైద్యులు. పక్కా సమాచారంతో దాడులు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు నాలుగు బాక్స్ల ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.

Related Posts