నందిగామ
ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో శివాలయం వెనుక ఉన్న 15 సెంట్ల భూమిని గుర్తుతెలియని వ్యక్తులు కబ్జా చేసి జెసిబి మిషన్లతో అందులో ఉన్న రేకుల షెడ్ ని రాత్రికి రాత్రే కూల్చివేసిన ఘటనకు వార్తలు రావడంపై దేవాదాయ శాఖ కమీషనర్ స్పందించారు. నందిగామ దేవాదాయ అధికారిగెల్లి హరి గోపీనాథ్ ను స్థలం తాలుకా పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దేవస్థాన అధికారి ముందుగా పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతు సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం నుండి గ్రామ కంఠం గా ఉన్న భూమి శ్రీ శ్యామలాంబ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిందని దీనిపై క్రయవిక్రయాలు జరపటానికి వీలులేదని వారు వంశీకులు ఉంటే అనుభవించాలే తప్ప దానిని క్రయవిక్రయాలు చదవడానికి వీలు లేదని వారి వంశస్థులు లేకపోతే తిరిగి దేవస్థానానికి చెందుతుందని దేవాదాయ అధికారులు తెలిపారు ఈ భూమికి సంబంధించి తన పైబెదిరింపులుపాల్పడుతున్నారని తనపై దాడి చేయటానికి కూడా ప్రయత్నిస్తున్నారనిదేవస్థాన అధికారి తెలిపారు