కడప
కడప జిల్లా దొంగ నోట్లు చలామణి చేస్తున్న ముఠా గుట్టును పొరుమామిల్ల పోలీసులు రట్టు చేసారు. వారి వద్ద ఉన్న నగదును పరిశీలించి దొంగ నోట్లు గా నిర్దారించి వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద నుంచి 4 లక్షల 44 వేల 500 రూపాయల నగదు , 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎనమిది మందిని అరెస్ట్ చేసారు. జిల్లా ఎస్పీ అన్బు రాజన్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. దొంగ నోట్ల చలామణి గుట్టు రట్టు చేసిన పొరుమామిల్ల సి.ఐ. రమేష్ బాబు, ఎస్సై, సిబ్బందిని అయన అభినందించారు.