మైదుకూరు
కడప జిల్లా మైదుకూరు భారత్ పెట్రోల్ బంక్ లో గత నెల మొబైల్ ఫోన్ ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. మొబైల్ ఫోన్ ద్వారా ఆన్ లైన్ లావాదేవీలు చేసి బాధితుని అకౌంట్ నుంచి 69 వేల నగదు ను ముద్దాయి షేక్ మహమ్మద్ విత్ డ్రా చేసినట్లు పోలీసులు గుర్తించారు. మైదుకూరు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి మొబైల్ ఫోన్, 69 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.