మాస్కో మే 9
ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యా గెలవకూడదని తాజాగా జీ7 దేశాలు సంయుక్త ప్రకటన రిలీజ్ చేశాయి. జీ7 గ్రూపులో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా దేశాలు ఉన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన సైనిక చర్యను జీ7 దేశాలు ఖండించాయి. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా గెలవద్దు అని ఆ దేశాలు వాగ్ధానం చేశాయి. ఉక్రెయిన్‌కు మరింత సైనిక, ఆర్థిక సహకారం అందించాలని ఆ దేశాలు తీర్మానించాయి. ఉక్రెయిన్‌పై పోరులో రష్యా విజయం సాధించకూడదని తామంతా ఒక్కటిగా ఉన్నామని సంయుక్త ప్రకటనలో తెలిపారు. మే 8వ తేదీన ఆ ప్రకటన రిలీజ్ చేశారు. పుతిన్ సిగ్గుమాలిన చర్యకు దిగారని, ఆ దేశ ప్రజల చరిత్రాత్మక త్యాగాలను విస్మరించారని, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించారని జీ7 దేశాలు ఆరోపించాయి.మరోవైపు ఇవాళ రష్యాలో విక్టరీ డే వేడుకలు జరుగుతున్నాయి. మాస్కోలో సైనిక పరేడ్ ఆర్గనైజ్ చేశారు. రెడ్ స్క్వేర్‌లో కాసేపటి క్రితం పరేడ్ ప్రారంభమైంది. మర్చింగ్ బ్యాండ్ మ్యూజిక్, రకరకాల యూనిఫామ్ సైనికులతో మాస్కో వెలిగిపోతోంది. పరేడ్‌ను పుతిన్ వీక్షిస్తున్నారు. అయితే ఇవాళ పుతిన్ తన ప్రసంగంలో ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు పశ్చిమ దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.