YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో టీడీపీ దూకుడు..డీలాపడ్డ వైసిపి

ఏపీలో టీడీపీ దూకుడు..డీలాపడ్డ వైసిపి

అమరావతి మే 9
ఏపీలో టీడీపీ దూకుడు పెంచింది. పోరాటాలతో క్షేత్రస్థాయికి వెళుతోంది. పన్నులు, చార్జీల పెంపును నిరసిస్తూ టీడీపీ చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమానికి స్పందన లభిస్తోంది. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ అనంతరం ముగ్గురు మంత్రులు స్వయంకృతాపరాధంతో సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. పేపర్ లీకేజ్‌పై మంత్రి బొత్స,  వివాదాస్పద వ్యాఖ్యలతో హోంమంత్రి, పోలవరంపై పరస్పర విరుద్ధ ప్రకటనలతో జలవనరుల శాఖ మంత్రి డిఫెన్స్‌లో పడ్డారు. మిగతా మంత్రులు కూడా టీడీపీపై మాట్లాడడంలేదు. ఈ పరిణామాలను సీఎం జగన్‌కు ఎంతమాత్రం నచ్చడంలేదు. కేబినెట్ సమావేశంలో అధికారిక ఎజెండా పూర్తి అయిన అనంతరం తాజా రాజకీయ పరిణామాలు.. గడప గడపకు వైసీపీ కార్యక్రమం, ప్రతిపక్షంపై విమర్శల దాడి పెంచడం వంటి అంశాలపై చర్చించి కొత్త మంత్రులకు సీఎం జగన్ దిశ నిర్దేశం చేయనున్నారు.మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ అనంతరం కొత్త మంత్రులతో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్ వెలువడింది. 13న ఉదయం 11 గంటలకు సచివాలయంలో మంత్రి వర్గ సమావేశం నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ నోటిఫికేషన్ వెలువరించారు. ఎజెండాకు సంబంధించిన అంశాలను పంపాలని ఆయా శాఖల కార్యదర్శులను కోరారు. గత నెల రోజులుగా వివిధ అంశాలపై ప్రభుత్వం పలు నిర్ణయాలు ప్రకటించిన వాటిపై కేబినెట్‌లో చర్చించి ఆమోదం తెలపనున్నారు

Related Posts