YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మలుపులు తిరుగుతున్న బీ ఫార్మశీ విద్యార్ధిని కేసు

మలుపులు తిరుగుతున్న బీ ఫార్మశీ  విద్యార్ధిని కేసు

అనంతపురం, మే 9,
నిన్నటిదాకా ఆత్మహత్య.. ఇప్పుడు రేప్ జరిగిందని కేసు నమోదు.. బీఫార్మసీ విద్యార్థిని హత్యకేసులో పోలీసుల తీరుపై విమర్శలు..బీఫార్మసీ స్టూడెంట్ తేజస్విని హత్యకేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు వెలుగులోకొస్తున్నాయి. నిన్నటిదాకా తేజస్వినిది ఆత్మహత్య అన్నారు.. ఇప్పుడు రేప్ జరిగిందంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. వారం రోజులు తిరిగేసరికల్లా ఒక డీఎస్పీ రెండు మాటల వెనుక ఆంతర్యమేంటి? డాక్టర్లు కూడా రేప్‌ జరగలేదని ఎందుకు నిర్ధారించారు? పోస్టుమార్టం రెండుసార్లు జరిపినా అసలు నిజాలు ఎందుకు బయటకురాలేదు? సంచలనం రేపిన ఈ కేసులో ఎందుకీ కన్ఫ్యూజన్‌? శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం మల్లాపల్లికి చెందిన తేజస్విని.. ఓ షెడ్డులో చున్నీతో ఉరి వేసుకొని అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. గోరంట్లకు చెందిన యువకుడితో ప్రేమ వ్యవహారంతో పాటు అత్యాచారం జరిగిందనే ఆరోపణలు మిన్నంటాయి. అయితే డీఎస్పీ మాత్రం రేప్‌ వార్తల్ని కొట్టిపడేశారు. జస్ట్ హ్యాంగింగ్‌ మాత్రమేనని అన్నారు. అదే డీఎస్పీ ఇప్పుడు రేప్ జరిగిందని నిర్దారించారు. బీ ఫార్మసీ విద్యార్థిని తేజస్విని మృతి కేసులో నిందితుడైన సాదిక్ను గోరంట్ల పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ రమాకాంత్, దిశా డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు.ప్రేమ పేరుతో తేజస్వినిని నమ్మించి.. శారీరకంగా అనుభవించి ఆమె మృతికి కారణమైన సాధిక్ను కొత్తచెరువు మండలం నారపల్లి వద్ద పోలీసులు అరెస్ట్ చేశారని డీఎస్పీ పేర్కొన్నారు. ద్విచక్ర వాహనం, సెల్ఫోన్ సీజ్ చేశామన్నారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం 376 సెక్షన్తో పాటు 420, 306 సెక్షన్లు నమోదు చేశామని తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చనున్నట్లు వెల్లడించారు. రెండు వారాల్లో కేసు దర్యాప్తు పూర్తి చేసి.. ఛార్జిషీట్ దాఖలు చేస్తామని దిశా డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.తేజస్వినిపై అత్యాచారం జరిగిందని స్తానికులతో పాటు టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఎస్పీ వాహనాన్ని అడ్డుకుని వీ వాంట్ జస్టిస్ అంటూ నినదించారు. ఈ క్రమంలో పోలీసులు రెండుసార్లు పోస్టుమార్టం నిర్వహించారు. కానీ రేప్ జరిగినట్టు ఎక్కడా నిర్దారించలేదు.డాక్టర్లది, పోలీసులది ఓకేమాట. అసలు ఎందుకీ అయోమయం. తమ బిడ్డను అన్యాయంగా పొట్టన బెట్టుకున్నారని తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. వాళ్ల బాధను, ఆవేదనను పోలీసులు, డాక్టర్లు ఎందుకు లైట్‌గా తీసుకున్నారు. డాక్టర్లు, పోలీసుల భిన్న వాదనల వెనుక ఎవరున్నారు? తెరవెనుక ఏదో జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన జరిగిన వెంటనే సాదిక్ అఙ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.
సూసైడ్.. రేప్ గా ఎందుకు మారింది
శ్రీసత్యసాయి జిల్లాలో బీఫార్మసీ విద్యార్థిని తేజస్విని అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును అత్యాచార కేసుగా మారుస్తున్నట్లు ఎస్పీ రాహుల్ దేవ్ వెల్లడించారు. మరోవైపు ఈ కేసును దిశ పోలీసులకు బదిలీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈనెల 4న గోరంట్ల మండలం మల్లాపల్లి సమీపంలో ప్రియుడు సాదిక్‌కు సంబంధించిన ఓ షెడ్డులో తేజస్విని ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. దీంతో పోలీసులు తొలుత తేజస్విని మృతిని ఆత్మహత్య కేసుగా నమోదు చేశారు. అయితే మృతురాలి తల్లిదండ్రులు మాత్రం సామూహిక అత్యాచారం, హత్యగా అనుమానించడంతో అత్యాచార కేసుగా నమెదు చేసినట్లు జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.ఈ మేరకు బీ ఫార్మసీ విద్యార్థిని కేసు విషయంలో ప్రభుత్వ తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. బీ ఫార్మసీ స్టూడెంట్ తేజస్విని హత్యాచారాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడం ముమ్మాటికీ వైసీపీ దండుపాళ్యం గ్యాంగ్‌ను తప్పించే ఎత్తుగడే అని ఆరోపించారు. తమ బిడ్డని రేప్ చేసి చంపేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తే.. పోస్ట్ మార్టం కాకుండానే ఆత్మహత్యగా డీఎస్పీ ఎలా సర్టిఫై చేస్తారని లోకేష్ ప్రశ్నించారు. సీఎం జగన్ కళ్లల్లో ఆనందం కోసమే పోలీసులు వ్యవహరిస్తోన్నట్టు అర్థమవుతోందని మండిపడ్డారు. నిన్నటి సూసైడ్ ఇవాళ రేప్‌గా ఎలా మారింది జగన్ గారూ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. ఇది యాగీ చేయడం కాదని.. మీ బిడ్డలకో, మీ నేతల పిల్లలకో ఇదే అన్యాయం జరిగితే ఇలానే స్పందిస్తారా అని సూటిగా నిలదీశారు.

Related Posts