గోరంట్ల
శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం మల్లెపల్లి లో జరిగిన తేజశ్వని అనుమాన స్వద కేసు లో నిందితుడు సాదిక్ ను అరెస్ట్ చేసి రిమాండు కు తరలించినట్లు డిస్పీ రమాకాంత్, దిశ డిఎస్పీ శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. ఇప్పటి వరకు జరిగిన కేసు విచారణ లో ఇది వరకు తేజశ్వని గత కొంతకాలంగా సాదిక్ పరిచయం వున్నట్లు,ఇది ప్రేమగా మారడంతో ఆమె పలు మార్లు పెళ్లి చేసుకోవాలని వత్తిడి చేసినట్లు తెలిసిందని దీనితో ఒత్తిడి కి లోనై భయంతో తేజశ్వని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తేలిందని డిస్పీ రమాకాంత్ తెలిపారు.నిందితుడు సాదిక్ ను నిన్నటి రోజు సీఐ జయనాయక్ జిల్లా లోని కొత్తచెరువులో అరెస్ట్ చేయడం జరిగిందని ఈరోజు పెనుగొండ కోర్టు కు హాజరు పరుస్తున్నట్లు మీడియాతో తెలిపారు.ఈ కేసు ప్రత్యేక విచారణ కోసం పుట్టపర్తి ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ ఆదేశాల మేరకు ఈ కేసును దిశ డిస్పీ శ్రీనివాసులు గారికి అప్పగించడం జరిగిందని ధర్మవరం డిఎస్పీ రమాకాంత్ మీడియా సమావేశంలో తెలిపారు.అనంతరం దిశ డిస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన విచారణ ను మొదలుకొని మరింత లోతుగా ఈ కేసును లో సాక్షులను విచారించి వాస్తవాలను వెలికి తీయడం జరుగుతుందని దిశ డిఎస్పీ శ్రీనివాసులు తెలిపారు