అమరావతి
క్యాంపు కార్యాలయంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం వైయస్.జగన్ సమీక్ష జరిపారు. ఈ శాఖపరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను అయన సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే...
ప్రతి నియోజకవర్గంలో ఎంఐజీ లేఅవుట్లు
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఒక ఎంఐజీ లే అవుట్ ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఈ లే అవుట్స్ ఆదర్శనీయంగా ఉండాలి. లే అవుట్స్ నియమాలు, నిబంధనలు, ప్రమాణాలన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలి. ప్రతి ఒక్కరూడా వీటిని చూసి, ఇదే మాదిరిగా లే అవుట్స్ ఉండాలన్న రీతిలో వీటిని తీర్చిదిద్దాలి. న్యాయవివాదాలు, ఎలాంటి ఇబ్బందులు లేని విధంగా క్లియర్ టైటిల్స్ వినియోగదారులకు ఉండాలి. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ (ఎంఐజీ లేఅవుట్స్) కోసం ఇప్పటివరకూ 82 అర్బన్ నియోజకవర్గాల్లో సుమారు 6791 ఎకరాల గుర్తించాం. శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, వైయస్సార్, కర్నూలు, శ్రీ సత్యసాయి, తిరుపతిలో రెండు చోట్ల లే అవుట్స్ పనులు, 864.29 ఎకరాల్లో లే అవుట్ పనులు వున్నాయని అన్నారు.
క్లీన్ ఆంధ్రప్రదేశ్ పై సీఎం సమీక్షిస్ంతూ తడిచెత్త, పొడిచెత్త, ప్రమాదకర వ్యర్థాలు అంటే ఏంటి? అన్నదానిపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి. ఏ కలర్ డబ్బాలో ఏ చెత్త వేయాలి అన్నదానిపై కరపత్రాలను ప్రతి ఇంటికీ ఇవ్వాలని అన్నారు.
అధికారులు మాట్లాడుతూ ఇప్పటికే 1.12 కోట్ల చెత్త డబ్బాలను పంపిణీచేశాం. 8 లక్షల చెత్త డబ్బాలను మే 22 నాటికి పంపిణీ చేస్తాం. 2426 ఆటోలు ఇప్పటికే క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో నిమగ్నమయ్యాయి. మిగిలినవి ఈనెలాఖరు నాటికి అందుబాటులోకి వస్తాయి. 1123 ఇ–ఆటోలు కూడా జూన్ నాటికి అందుబాటులోకి వస్తాయి. గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లు డిసెంబరు నాటికి పూర్తయ్యేలా కార్యాచరణ వుంటుందని అన్నారు.
ప్రతి ఇంటికీ ప్రతిరోజూ తాగునీరు పై మాట్లాడుతూ ప్రతిరోజూ ప్రతి ఇంటికీ తాగునీరు అందాలి. దీనిపై సమగ్ర పర్యవేక్షణ, పరిశీలన ఉండాలి. ఇది జరుగుతోందా? లేదా? అన్నదానిపై ఎప్పటికప్పుడు సమాచారం రావాలి. దీనివల్ల వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. దశాబ్దాల కాలంగా ప్రభుత్వాలు, వస్తున్నాయి, పోతున్నాయి. కాని అసలు సమస్య ఏంటంటే..? ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటనేవి తెలుస్తాయి, కాని వాటి పరిష్కారంలోనే నిర్లక్ష్యం కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు వాటి పరిష్కారంలో అంకిత భావం చూపకపోతే.. అవి అలానే ఉండిపోతాయని అన్నారు.
టిడ్కో ఇళ్లపై సమీక్ష లో సీఎం మాట్లాడుతూ రోడ్లు, తాగునీరు, మురుగునీటి శుద్ధిలాంటి లాంటి కనీస మౌలిక సదుపాయాలు లేకుండా టిడ్కో ఇళ్లు ప్లాన్ చేశారు. మన ప్రభుత్వం వచ్చాక వాటిపై దృష్టి పెట్టింది. పెద్ద ఎత్తున సీసీ రోడ్లు, తాగునీటికోసం వాటర్ ట్యాంకులు, మురుగునీటి శుద్ధి సదుపాయాలను ఏర్పాటు చేస్తోంది. ఇవి లేకపోతే మళ్లీ మురికివాడలు మాదిరిగా తయారయ్యేవి. మంచి జీవన ప్రమాణాలు అందించే దిశగా మనం అడుగులు ముందుకేస్తున్నాం. టిడ్కో ఇళ్లను ఆ మేరకు తీర్చిదిద్దాం. టిడ్కో ఇళ్ల మీద సుమారుగా రూ.5500 కోట్లు ఈమూడేళ్లలో ఖర్చుచేశాం. రానున్న రోజుల్లో మరింత ఖర్చు చేస్తామని వెల్లడించారు.