YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కన్నా...ఎంట్రీతో రాయపాటి పునరాలోచన

కన్నా...ఎంట్రీతో రాయపాటి పునరాలోచన

మ‌ళ్లీ పోటీకి రాయ‌పాటి రెడీ.. రీజ‌న్ ఇదే!రాజ‌కీయాలు ఇక చాలు! అన్న నోటితోనే మ‌ళ్లీ పోటీకి సై! అంటున్నారు గుంటూరు కుచెందిన సీనియ‌ర్ రాజ‌కీయ దిగ్గ‌జం, ప్ర‌స్తుత టీడీపీ ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు. దాదాపు పదేళ్లకు పైగా గుంటూరు జిల్లాలో అధికారం చెలాయించిన కన్నాకు 2014 ఎన్నికలు చెక్‌ పెట్టాయి. ఆర్థిక పరంగా, విపక్షాలు కూడా ఊహించని విధంగా ఎదిగిన కన్నా.. దూకుడుకు కళ్లెం పడింది. తనరాజకీయ గురువైన మాజీ కాంగ్రెస్ నేత కావూరి సాంబశివరావు బీజేపీలో చేరడంతో.. ఆయన సూచనలతో బీజేపీలో చేరారు. ప్ర‌స్తుతం ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఆయ‌న ఏపీ బీజేపీ ర‌థ సార‌ధ్య బాధ్య‌త‌లు చేప‌ట్టారు. దీంతో రాయపాటి మ‌రోసారి క‌న్నాపై క‌న్ను ప‌డింది. కన్నాను దెబ్బకొట్టాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని స‌మాచారం. తాను రాజ‌కీయాల నుంచి విశ్రాంతి తీసుకుంటే.. క‌న్నా.. చెల‌రేగిపోవ‌డం ఖాయ‌మ‌ని రాయ‌పాటి భావిస్తున్నాడు. అంతే కాకుండా..కన్నాకు వైసీపీ, జనసేన నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఆయన గుంటూరు నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.కాంగ్రెస్‌లో వీర విధేయుడిగా ఉన్న రాయ‌పాటి.. 2014 విభ‌జ‌న స‌మ‌యం లో పార్టీతో విభేదించి టీడీపీ తీర్థం పుచ్చుకున్నాడు. ఆ స‌మ‌యంలోనే న‌ర‌స‌రావు పేట ఎంపీగా టికెట్ సాధించారు. అయితే, ఆయ‌న‌వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను ఇక రాజ‌కీయాల‌కు గుడ్ బై చెబుతాన‌ని ప‌లు సంద‌ర్బాల్లో ప్ర‌క‌టించాడు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న కుమారుడు రాయ‌పాటి రంగారావును రాజ‌కీయాల్లోకి దింపుతాన‌ని కూడా చెప్పాడు. దీంతో అంద‌రూ రాయ‌పాటికి వార్ధ‌క్యం వ‌చ్చింద‌ని, అందుకే రాజ‌కీయాల నుంచి విర‌మించుకుంటున్నార‌ని అన్నారు.అనూహ్యంగా ఆయ‌న త‌న రూటు మార్చుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ చేస్తాన‌ని చెప్పాడు. ఈ హ‌ఠాత్ ప్ర‌క‌ట‌న‌తో టీడీపీ నాయ‌కులు నివ్వ‌ెర పోయారు. ప్ర‌ధానంగా న‌ర‌స‌రావు పేట ఎంపీ స్థానం నుంచి రాయ‌పాటి త‌ప్పుకొంటే తాము పోటీ చేయాల‌ని భావించిన ప‌లువురు నాయ‌కులు నిరాశ‌లో కూరుకుపోయారు. దీంతో రాయ‌పాటి ఎందుకు మ‌ళ్లీ పోటీకి సిద్ధ‌మ‌య్యాడా? అని దృష్టి పెట్టారు. దీంతో వారికి చాలా ఆస‌క్తిక‌ర స‌మాధానం ల‌భించింది. రాయ‌పాటి ఇలా యూట‌ర్న్ తీసుకోవ‌డానికి రీజ‌న్ ప్ర‌స్తుతం బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఎంపికైన క‌న్నా ల‌క్ష్మీనారాయణేన‌ని తెలుస్తోంది. రాయపాటి కాంగ్రెస్‌లో ఉన్నప్ప‌టి నుంచి కన్నాతో బద్దవైరం ఉండేది. పరస్పరం విమర్శ లు.. ఆరోపణలు చేసుకున్నారు.. చివరకు పరువు నష్టం దావా కూడా వేసుకున్నారు.కావూరితో…ఇటు కన్నాతో రాజకీయ వైరం ఉన్న రాయపాటి మళ్లీ వారిద్దరూ రాజకీయంగా తెరపైకి రాకుండా ఉండాలం టే… తాను క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకోకూడదని.. భావించి ఈ ప్రకటన చేసి ఉంటార‌ని అంటున్నారు. గుంటూరు నుంచి కన్నా పోటీ చేస్తే.. రాయ‌పాటి వ‌ర్గం ఆయ‌న‌ను అవలీలగా ఓడిస్తుంద‌న‌డంలో సందేహం లేదు. ఈ నేప‌థ్యంలోనే రాయ‌పాటి తాను రాజ‌కీయాల‌కు దూరం కాన‌ని ప్ర‌క‌టించి ఉంటార‌ని అంటున్నారు. మ‌రి ఏంజ‌రుగుతుందో చూడాలి.

Related Posts