విజయవాడ, మే 10,
లసి రావాలని చంద్రబాబు పిలుపు ఇస్తే.. తాము సిద్ధమని జనసేన సంకేతాలు ఇచ్చింది. దీంతో వీరి పొత్తులు ఖాయమని.. కలసి పోటీ చేయడం ఖాయమని తేలిపోయింది. అయితే చాలా మంది 2014 రిపీట్ అవుతుందా లేదా అన్న సందేహంలో ఉన్నారు. అంటే.. బీజేపీ కూడా వీరి కూటమిలో కలుస్తుందా లేదా అన్నది సందేహం. ప్రస్తుతం జనసేన బీజేపీతో పొత్తులో ఉంది. ఆ పొత్తు వల్ల ఒక్క ఓటు కలసి రాకపోగా ముస్లిం మైనార్టీ ఓట్లన్నీ దూరమైపోయాయని జనసేన నేతలు బహిరంగంగానే చెబుతూంటారు. దీంతో బీజేపీతో మాత్రమే పొత్తు కొనసాగించే అవకాశాలే లేవు. ఉంటే టీడీపీ, బీజేపీ లేకపోతే టీడీపీ అన్నట్లుగా జనసేన పరిస్థితి ఉంది. బీజేపీ నేతలు ఇప్పటికే అతి ప్రకటనలు చేస్తున్నారు. జనసేన పేరు కూడా పెద్దగా ప్రస్తావించకుండా తాము వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తున్నామని ఎవరి పొత్తులు.. త్యాగాలు అవసరం లేదని సోము వీర్రాజు లాంటి నేతలు పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్నారు. జనసేన ఒంటరిగా పోటీ చేయాలని.. ఓట్లు చీలిపోవాలని కోరుకుంటున్న వైసీపీ నేతల ప్రకటనలకు తగ్గట్లుగానే ఆయనవి ఉంటున్నారు. ఆయన ఏపీ బీజేపీ అధ్యక్షుడుకాబట్టి ఆయన మాటలకు విలువ ఉంటోంది. లేకపోతే ఎవరూ పట్టించుకోరు. కానీ పొత్తులను డిసైడ్ చేసేది కేంద్రంలోని నేతలే. ఎంపీలతో కేంద్రంలో సపోర్ట్ చేస్తామని ..ఏపీలో మాత్రం పొత్తులు సీట్ల సర్దుబాటు మాత్రం వద్దని వైసీపీ తరహాలో బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించేందుకు జనసేన ప్రయత్నించే అవకాశం ఉంటుందని అంటున్నారు. బీజేపీకి ఒక్క శాతం కూడా ఓటు బ్యాంక్ లేదు. ఆ పార్టీ వల్ల ఆయా పార్టీలకు కలసి వచ్చేదేమీ ఉండదు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్నపార్టీ కాబట్టి ఎన్నికల సమయంలో చాలా అంశాలు కలసి రావడానికి కొన్ని పనులు ఆటంకం లేకుండా చేయడానికి చాన్స్ ఉంటుంది. ఆ కారణాల వల్ల మాత్రమే బీజేపీని కన్సిడర్ చేస్తారు. బీజేపీని కలుపుకుంటారో లేదో కానీ జనసేన కూడా రాష్ట్ర భవిష్యత్ కోసం తాము కీలక నిర్ణయాలు తీసుకోక తప్పదని చెబుతున్నారు. విపక్షాలన్నీ కలసిపోయి .. ప్రభుత్వ వ్యతిరేకత పెరిగి.. ఆ ఓట్లన్నీ కేంద్రీకృతం అయితే.. వైసీపీకి ఘోరపరాజయం తప్పదని ఇప్పటికే రాజకీయ నిపుణులు తేల్చేశారు.