YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సమ్మర్ లో కానరాని ప్రాజెక్టుల పనులు

సమ్మర్ లో కానరాని  ప్రాజెక్టుల పనులు

గుంటూరు, మే 10,
సాగునీటి వ్యవస్థను మెరుగుపరచడంతోపాటు లక్షలాది ఎకరాల ఆయకట్టును స్థిరీకరించే ఉద్దేశ్యంతో చేపట్టిన డెల్టాల అధునీకరణ పనులు ముందుకు సాగడం లేదు. ఆయుకట్టు చివరి భూములకు నీటిని అందించడమే లక్ష్యంగా 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆధునీకరణ పనులు చేపట్టారు. కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాల ఆధునికీకరణకు రూ.10 వేల కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాలలో సుమారు 26 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేందుకు పనులు ప్రారంభమయ్యాయి. వైఎస్‌ అనంతరం సిఎంలుగా ఉన్న కె రోశయ్య, ఎన్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ పనులపై పెద్దగా ఆసక్తి కనబరచలేదు.. రాష్ట్ర విభజన తర్వాత టిడిపి అధికారంలోకి వచ్చినా, ఆ ప్రభుత్వం కూడా ఆధునికీకరణపై పెద్దగా దృష్టి సారించలేదు. ప్రస్తుతం వైఎస్‌ తనయుడు వైఎస్‌ జగన్‌ సిఎంగా ఉన్నప్పటికీ, ఆధునీకరణ పనులకు పెద్దగా ప్రాధాన్యత లభించకపోవడం చర్చనీయాంశంగా మారింది.కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఆయకట్టు స్థిరీకరణకు రూ.4,573 కోట్లను, గోదావరి డెల్టాలో 10.38 లక్షల ఎకరాల కోసం రూ.3,361 కోట్లను, నెల్లూరులో పెన్నా డెల్టాలోని 2.47 లక్షల ఎకరాల కోసం 1,215.64 కోట్లను కేటాయిస్తున్నట్లు 2009లో అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. సాగునీటి కాల్వలు, డ్రైన్‌లను అభివృద్ధి చేయడంతోపాటు, కాల్వల షట్టర్లు, హెడ్‌ వర్క్స పనులను చేపట్టాల్సి ఉంది. ఏ డెల్టాలోనూ 50 శాతానికి మించి పనులు జరగలేదు. ఎనిమిదేళ్ల నుంచి డెల్టా ఆధునికీకరణకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపు కూడా అంతంత మాత్రంగానే ఉంటోంది. కృష్ణా డెల్టాలో రూ.4,573 కోట్లకుగానూ ఈ ఏడాది ఫిబ్రవరినాటికి రూ.2,636.95 కోట్లను ఖర్చు చేసినట్లు జలవనరులశాఖ అధికారులు చెబుతున్నారు. గోదావరి డెల్టాలో రూ.3,361 కోట్లకుగానూ రూ.1,556.05 కోట్లను, పెన్నా డెల్టాలో రూ.1,215.64 కోట్లకు రూ.733.57 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. మూడు డెల్టాల ఆధునికీకరణ పనులు పూర్తి చేసేందుకు ఇంకా రూ.5,288.45 కోట్ల అవసరం ఉంది.కొత్త ఎస్‌ఎస్‌ఆర్‌ ప్రకారం పూర్తిస్థాయిలో డెల్టాలను అభివృద్ధి చేయాలంటే కనీసం ఆరేడు వేల కోట్ల రూపాయల అవసరం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ, తాజా బడ్జెట్‌లో మూడు డెల్టాలకు రూ.131.24 కోట్లనే ప్రభుత్వం కేటాయించింది. డెల్టాలకు బడ్జెట్‌లో కేటాయించిన నిధులు ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ (ఓ అండ్‌ ఎం) పనులకు కూడా చాలవనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Related Posts