YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నారాయణ అరెస్టును ఖండించిన అచ్చెన్నాయుడు

నారాయణ అరెస్టును ఖండించిన అచ్చెన్నాయుడు

విజయవాడ
మాజీ మంత్రి నారాయణ అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.  జగన్ రెడ్డి తన అసమర్థ పాలన నుంచి దృష్టి మరల్చేందుకే ఈ అక్రమ అరెస్ట్ లు.  ఏ కేసులో, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా పోలీసులు చెప్పకపోవడం జగన్ రెడ్డి అప్రజాస్వామిక పాలనకు నిదర్శనం.   మూడేళ్ల పాలనలో కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇచ్చి.. టీడీపీ నేతలను అక్రమ అరెస్ట్ లు, అక్రమ నిర్బంధాలకు పాల్పడ్డారు.   జగన్ రెడ్డి అవినీతిని, విధ్వంస పాలనను ప్రశ్నించిన వారిపై వేల సంఖ్యలో అక్రమ కేసులు నమోదు చేశారని అన్నారు.
ప్రజలు అధికారం కట్టబెట్టింది అభివృద్ధి చేయడానికి కానీ.. ప్రతిపక్ష పార్టీల నేతలపై కక్షసాధింపు చర్యల కోసం కాదు.   ఎలాంటి నోటీసులు లేకుండా మాజీ మంత్రి పట్ల ఇష్టానుసారంగా వ్యవహరించారు.   రోజురోజుకూ జగన్ రెడ్డి పట్ల పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారు.   రాష్ట్రంలో పదో తరగతి ప్రశ్నాపత్నాల లీకేజీ ఎక్కడా జరగలేదని స్వయంగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఓ వైపు చెబుతుంటే.. మరోవైపు ఇదే వ్యవహారంలో నారాయణను ఏవిధంగా అరెస్ట్ చేస్తారు?   రాజకీయ కుట్రలో భాగంగానే నారాయణను అరెస్ట్ చేశారు.   పరీక్షల నిర్వహణలో విఫలమై ఆ నెపాన్ని నారాయణపై నెట్టారు.   అక్రమ అరెస్ట్ ల పట్ల భవిష్యత్ లో మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు.

Related Posts