విజయవాడ, మే 10,
టీడీపీ మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కొండాపూర్‌లోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణను ఆయన సొంత వాహనంలోనే పోలీసులు ఏపీకి తరలించారు. టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీతో నారాయణ విద్యాసంస్థలకు సంబంధముందన్న ఏపీ పోలీసులు మాజీ మంత్రి నారాయణను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఏపీ టెన్త్ పరీక్షల్లో ప్రశ్నపత్రం లీకేజీ ఘటనలు సంచలనం కలిగించాయి. సీఎం జగన్ కూడా నారాయణ, చైతన్య సంస్థలపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే సుమారు 45 మంది ప్రభుత్వ టీచర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.మరో వైపు మాజీ మంత్రి నారాయణ కిడ్నాప్ గురయ్యారని హైదరాబాద్ రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు నమోదైంది. నారాయణ వ్యక్తిగత సహాయకులు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాయదుర్గం పోలీసులు అలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో షాద్ నగర్ కొత్తూరు సమీపంలో ఏపీ పోలీసుల వాహనాలను పోలీసులు నిలిపివేశారు. తాము పదోతరగతి ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంలో అదుపులోకి తీసుకున్నట్టు ఏపీ పోలీసులు చెప్పడంతో తెలంగాణ పోలీసులు వారి వాహనాలకు దారిచ్చారు. అనంతరం మాజీ మంత్రి నారాయణను ఏపీ పోలీసులు కొత్తూరు నుంచి చిత్తూరుకు తరలించారు.
పరీక్షలో నిర్వహణలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే-దేవినేని ఉమ
మాజీ మంత్రి నారాయణను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నాం. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఈ అక్రమ అరెస్టుకు పాల్పడ్డారు. పరీక్షల నిర్వహణలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అక్రమాలకు తెగబడింది. తప్పుడు కేసులకు, అక్రమ అరెస్టులకు టీడీపీ నేతలు భయపడరు. జగన్ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.
పేపర్ లీకేజీ జరగలేదని టీడీపీ నేతలు చెప్పగలరా?-బొత్స
టెన్త్ పేపర్ లీకేజీ కేసులో అన్ని జిల్లాల్లో పోలీసులు విచారణ చేపట్టారని మంత్రి బొత్స వెల్లడించారు. టీడీపీ నేతలు రాజకీయంగా మాట్లాడుతున్నారని.. పేపర్ లీకేజీ జరగలేదని టీడీపీ వాళ్లు చెప్పగలరా అని ప్రశ్నించారు. పేపర్ లీకేజీ కేసులో నారాయణ పాత్రపై పోలీసులు నిగ్గు తేలుస్తారని స్పష్టం చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన వారిలో నారాయణ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ కూడా ఉన్నారన్నారు. అమరావతి ల్యాండ్ పూలింగ్ కేసులో అక్రమాలు జరగకపోతే ఎందుకు కేసు పెడతారని బొత్స నిలదీశారు.
ఇందులో రాజకీయ కుట్రేమీ లేదు- మాజీ మంత్రి బాలినేని
ఇది కేవలం టెన్త్ క్లాస్‌కు సంబంధించిన అంశం. పేపర్ లీక్ కేసులో పోలీసులు విచారణ చేసిన తర్వాతే టీడీపీ నేత నారాయణను అరెస్ట్ చేశారు. ఆయనపై తగిన చర్యలు తీసుకుంటారు. ఇందులో రాజకీయ కుట్ర ఉందని టీడీపీ నేతలు ఆరోపించడంలో అర్ధం లేదు.
ఆధారాలతోనే పోలీసులు అరెస్ట్ చేశారు-ఎమ్మెల్యే మల్లాది విష్ణు
నారాయణ విద్యా సంస్థల నుంచే టెన్త్ పేపర్ వాట్సాప్ అన్ని గ్రూపుల్లో పెట్టారని పోలీసుల దగ్గర ఆధారాలు ఉన్నాయి. ప్రాథమిక ఆధారాలతోనే పోలీసులు మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేశారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు వాస్తవాలు తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలి. అక్రమాలు జరిగాయనే తెలిసే ఇలా మాట్లాడుతున్నారు. ఇవి నారాయణ విద్యా సంస్థలు కాదు.. నారా విద్యా సంస్థలుగా మారాయి.
నారాయణ అరెస్ట్ రాజకీయ కుట్ర-ప్రత్తిపాటి పుల్లారావు
ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ ని ఖండిస్తున్నాం. ప్రశ్నాపత్రాల లీకేజీయే జరగలేదని స్వయాన మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈ అరెస్ట్ రాజకీయకుట్రతో జరిగింది. వైసీపీ క్షేత్రస్థాయిలో బలహీనపడుతోంది. టీడీపీ నేతలపై అక్రమకేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్న నారాయణ పేరుని పాడుచేయాలని చూస్తున్నారు. అక్రమ కేసులు పెట్టి నారాయణ విద్యాసంస్థల్ని బలహీనపరిస్తే విద్యార్ధులు నష్టపోతారు. నారాయణను వెంటనే విడుదలచేయాలి.
మాజీ మంత్రి నారాయణపై మరో కేసు నమోదు
మాజీ మంత్రి నారాయణపై ఏపీ సీఐడీ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో ల్యాండ్ పూలింగ్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. ల్యాండ్ పూలింగ్ కేసులో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో మొత్తం 14 మంది పేర్లను పోలీసులు చేర్చారు. A1గా చంద్రబాబు, A2గా నారాయణ, A3గా లింగమనేని రమేష్, A4గా లింగమనేని శేఖర్, A5గా అంజనీకుమార్, A6గా హెరిటేజ్ ఫుడ్స్‌ను పోలీసులు పేర్కొన్నారు. 2014-19 మధ్య భూసేకరణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేసు పెట్టామన్నారు.
నారాయణ అరెస్ట్ వెనుక జగన్ కుట్ర ఉంది
పదో తరగతి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకుందని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. ఆ పాపాన్ని నారాయణపై నెట్టేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. నారాయణ అరెస్ట్ వెనుక జగన్ కుట్ర ఉందన్నారు. ఈ ప్రభుత్వంతో తాడో.. పేడో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. అక్రమ అరెస్టులకు తాము భయపడమన్నారు.
విద్యాశాఖ మంత్రిని ఎందుకు అరెస్ట్ చేయరు?
టెన్త్ ప్రశ్నాపత్రాల లీక్ కేసులో ప్రభుత్వ టీచర్లను అరెస్ట్ చేసినప్పుడు విద్యాశాఖ మంత్రి బొత్సను ఎందుకు అరెస్ట్ చేయరని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి ప్రశ్నించారు. పేపర్ లీక్ వ్యవహారంలో ప్రభుత్వం పరువు పోయిందని.. అందుకే ఇప్పుడు ఎదుటివాళ్లపై బురదజల్లుతోందని ఆయన ఆరోపించారు. నారాయణ విద్యా సంస్థలంటే అంత తేలిగ్గా ఉందా అంటూ నిలదీశారు. రాజకీయాల్లోకి వచ్చాక నారాయణ తన విద్యా సంస్థల నిర్వహణ నుంచి తప్పుకున్నారని వివరించారు.
జగన్ ఇంట్లో గ్యాస్ లీకైనా దానికి మేమే కారణమా?
జగన్ ప్రభుత్వం కావాలనే ఏదో ఒక సాకుతో టీడీపీ నేతలను అరెస్ట్ చేయిస్తోందని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు ఆరోపించారు. జగన్ ఇంట్లో గ్యాస్ లీకైనా.. పరీక్షల్లో పేపర్ లీకైనా దానికి టీడీపీనే కారణమంటే ఎలా అని ప్రశ్నించారు.
మండిపడుతున్న టీడీపీ నేతలు
తెలుగు రాష్ట్రాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పదోతరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వెనుక నారాయణ, చైతన్య విద్యాసంస్థల ప్రమేయం ఉందంటూ ఇటీవల ఏపీ సీఎం జగన్ బహిరంగంగానే వ్యాఖ్యానించిన నేపథ్యంలో నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్ కొండాపూర్‌కు వచ్చి నారాయణను చిత్తూరు పోలీసులు తీసుకెళ్లారు. మాజీ మంత్రి నారాయణ వెంట ఆయన భార్య రమాదేవి ఉన్నారు. మరోవైపు టెంత్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో బాధ్యులైన వారిని వదిలిపెట్టేది లేదు, కుట్ర పన్ని ఈ వ్యవహారం నడిపారు. ఎన్ని డ్రామాలు చేసినా క్షమించేది లేదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.
నారాయణ అరెస్టును ఖండిస్తున్నాం:కళా వెంకట రావు
నారాయణ అరెస్టు విషయంలో రాజకీయ కక్షతో చేసిన అరెస్టు తప్పా కారణం చెప్పే పరిస్థితి లేదు. ప్రజలందరూ అర్ధం చేసుకుని తిరగబడే రోజు వస్తుంది.జిల్లా పార్టీ తరపున నారాయణ అరెస్టును ఖండిస్తున్నాం. గత మూడేళ్ళుగా జగన్, సజ్జల్ ప్రస్టేషన్ లోకి వెళ్లిపోయారు. సజ్జల, జగన్ మానసికంగా బాధపడుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి పక్షాలు మాట్లాడితే వాటిలో మంచిని తీస్కుంటారు. చెడును విడిచి పెడతారు. తప్పుడు కేసులు పెట్టడం, భయాందోళనకు గురి చేయడం, అరెస్టులు చేయడం చేస్తున్నారు. అసెంబ్లీని కూడా కౌరవ సభ చేసేసారు
ఇది అధికార దుర్వినియోగమే :అశోక్ గజపతి రాజు
నారాయణ అరెస్టుపై స్పందించారు మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు. టీడీపీ నాయకులు కేసులు పెట్టారు… పెడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది. నా పైన కేసులు పెట్టారు. కళా వెంకట రావుపైన కేసులు పెట్టి అరెస్టు చేశారు. ఒక్క టీడీపీ నాయకులు పైనే కాకుండా 150 కి పైగా దేవాలయాల పైన దాడులు జరిగాయి. వైసీపీ ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోంది. ఇది ఒక రెడీక్లాస్ ప్రభుత్వం. ప్రజా హితం కోసం కాకుండా అధికార దుర్వినియోగం కోసం పని చేస్తున్నారు. మూడు రాజధానుల విషయంలో వికేంద్రీకరణ అనే కొత్త పదాన్ని తీసుకువచ్చారు
అక్రమ అరెస్టులతో విద్యార్ధులకు మేలు జరగదు: నారా లోకేష్
చేతగానితనాన్ని ఇతరులపైకి నెట్టేయడం.. చేసిన నేరాలు, అక్రమాలకు ఇతరుల్ని బాధ్యులని చెయ్యడం జగన్ అండ్ కో ట్రేడ్ మార్క్. పదో తరగతి పేపర్ లీక్ ఘటనలపై మంత్రి బొత్స, సిఎం జగన్ విరుద్ధ ప్రకటనలు ప్రజలంతా చూసారు. ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడంతో పాటు రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నారాయణపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారు. సంబంధం లేని కేసులో నారాయణ దంపతులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. పేపర్ లీకేజ్ ఘటనల్లో అసలు సూత్రధారులైన వైసీపీ నేతల్ని వదిలేసి టీడీపీ నేతల్ని అరెస్ట్ చేయించి సైకో ఆనందం పొందుతున్నారు. ఈ అక్రమ అరెస్టుల వల్ల పరీక్షలు రాసిన విద్యార్థులకు ఎటువంటి మేలు జరగదు.
ఇది కక్ష సాధింపే: అచ్చెన్నాయుడు
కక్ష్య సాధింపుల్లో భాగంగానే టీడీపీ నేత నారాయణను ప్రభుత్వం అరెస్ట్ చేయించిందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. జగన్ తన అసమర్థ పాలన నుంచి దృష్టి మరల్చేందుకే ఈ అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. మూడేళ్ల పాలనలో కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యతిచ్చి టీడీపీ నేతలను అక్రమ అరెస్టులు, అక్రమ నిర్బంధాలకు పాల్పడ్డారని మండిపడ్డారు.
ఇది రాజకీయ కుట్ర: ప్రత్తిపాటి పుల్లారావు
ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ ని ఖండిస్తున్నాం. ప్రశ్నాపత్రాల లీకేజీయే జరగలేదని స్వయాన మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈ అరెస్ట్ రాజకీయకుట్రతో జరిగింది. వైసీపీ క్షేత్రస్థాయిలో బలహీనపడుతోంది. టీడీపీ నేతలపై అక్రమకేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్న నారాయణ పేరుని పాడుచేయాలని చూస్తున్నారు. అక్రమ కేసులు పెట్టి నారాయణ విద్యాసంస్థల్ని బలహీనపరిస్తే విద్యార్ధులు నష్టపోతారు. నారాయణను వెంటనే విడుదలచేయాలి.
ఈ అరెస్ట్ వెనుక జగన్ కుట్ర: బుద్దా వెంకన్న
పదో తరగతి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకుందని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. ఆ పాపాన్ని నారాయణపై నెట్టేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. నారాయణ అరెస్ట్ వెనుక జగన్ కుట్ర ఉందన్నారు. ఈ ప్రభుత్వంతో తాడో.. పేడో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. అక్రమ అరెస్టులకు తాము భయపడమన్నారు.
విద్యామంత్రిని అరెస్ట్ చేయాలి: సోమిరెడ్డి
టెన్త్ ప్రశ్నాపత్రాల లీక్ కేసులో ప్రభుత్వ టీచర్లను అరెస్ట్ చేసినప్పుడు విద్యాశాఖ మంత్రి బొత్సను ఎందుకు అరెస్ట్ చేయరని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి ప్రశ్నించారు. పేపర్ లీక్ వ్యవహారంలో ప్రభుత్వం పరువు పోయిందని.. అందుకే ఇప్పుడు ఎదుటివాళ్లపై బురదజల్లుతోందని ఆయన ఆరోపించారు. నారాయణ విద్యా సంస్థలంటే అంత తేలిగ్గా ఉందా అంటూ నిలదీశారు. రాజకీయాల్లోకి వచ్చాక నారాయణ తన విద్యా సంస్థల నిర్వహణ నుంచి తప్పుకున్నారని వివరించారు.
ఏది జరిగినా మేమే కారణమా? చెంగల్రాయుడు
జగన్ ప్రభుత్వం కావాలనే ఏదో ఒక సాకుతో టీడీపీ నేతలను అరెస్ట్ చేయిస్తోందని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు ఆరోపించారు. జగన్ ఇంట్లో గ్యాస్ లీకైనా.. పరీక్షల్లో పేపర్ లీకైనా దానికి టీడీపీనే కారణమంటే ఎలా అని ప్రశ్నించారు.
టెన్త్ పేపర్ లీక్ కేసులో విస్తుపోయే నిజాలు!
టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారంలో నారాయణ సంస్థల అధినేత టీడీపీ మాజీ మంత్రి నారాయణను పోలీసులు మంగళవారం (మే 10) అదుపులోకి తీసుకున్నారు. ఏప్రిల్ 4న నారాయణ కాలేజి వైస్ ప్రిన్సిపల్‌తో సహా మరికొందరిని అరెస్టు పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితోపాటు పేపర్‌లీక్ ఉదంతంలో పాలుపంచుకున్న పలువురు టీచర్లను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.నారాయణ విద్యాసంస్థల సిబ్బంది ఫోన్లలో కీలక డేటా.. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. నారాయణ విద్యాసంస్థల సిబ్బంది వినియోగించిన ఫోన్లలో కీలక డేటా బయటపడింది. కేవలం తమ విద్యాసంస్థలకు ర్యాంకులు రావాలనే దురాలోచనతో నారాయణ సిబ్బంది బరితెగింపు చర్యలకు పాల్పడింది. ప్రశ్నపత్రాలను ఫొటోలు తీసి, షేర్చేసి తమ విద్యార్ధులకే ఎక్కువ మార్కులు వచ్చేలా అక్రమాలకు తెరదించారు. ఎవరి ఆదేశాలమేరకు ఈ వ్యవహారాన్ని నడిపారు, ఎన్నేళ్లుగా ఇదంతా నడుస్తుందన్న దానిపై చిత్తూరు పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఇక వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకునే ఈ విధమైన విద్యాసంస్థలపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఈ కేసులో ఏపీ పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు.మాజీ మంత్రి నారాయణ అరెస్టు ఇలా.. నారాయణ సంస్థల అధినేత టీడీపీ మాజీ మంత్రి నారాయణను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ఏపీ సీఐడీ పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు. పేపర్ లీకేజీ కేసులో ఆయన్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఐతే ఏ నేరం కింద నారాయణను అరెస్ట్ చేశారనే విషయాన్ని పోలీసులు అధాకారికంగా ఇంకా ప్రకటించలేదు.కాగా, ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల సందర్భంగా ప్రశ్న పత్రాలు వరుసగా లీక్ అయ్యాయి. ఈ లీకేజీ వెనుక శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థల ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి విజయవాడ నుంచి ప్రత్యేకంగా ఏపీ సీఐడీ బృందం హైదరాబాద్‌కు చేరుకుంది. ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులను కూడా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.