YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

రేపు జూనియర్ అప్ కమింగ్ మూవీ ఫస్ట్‌లుక్‌

 రేపు జూనియర్  అప్ కమింగ్ మూవీ ఫస్ట్‌లుక్‌

జూనియర్ పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే గిఫ్ట్‌ని ప్లాన్ చేశారు ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్. మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని మే 19న ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ను అనౌన్స్ చేస్తున్నట్టు ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ ప్రస్తుతం తన 28 మూవీని శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్నారు.ఈ ఇద్దరూ కలిసి మొదటిసారి పనిచేస్తుండటంతో ఈ చిత్రంపై భారీగా అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు ఎన్టీఆర్ ‘జై లవకుశ’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత త్రివిక్రమ్‌తో చేస్తుండటం ఒక విశేషమైతే.. ‘అజ్ఞాతవాసి’ డిజాస్టర్ తరువాత త్రివిక్రమ్ ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితే ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టాడు. ఈ నేపథ్యంలో విడుదలౌతున్న ఈ చిత్ర టైటిల్, ఫస్ట్‌లుక్ కోసం నందమూరి అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని ‘అజ్ఞాతవాసి’ చిత్ర నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. 

Related Posts