YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆన్ లైన్ లో ఖనిజాల వేలం

ఆన్ లైన్ లో ఖనిజాల వేలం

గుంటూరు, మే 11,
రాష్ట్రంలోని చిన్నతరహా ఖనిజాల లీజులకు  ఆన్‌లైన్‌ వేలం జరగనుంది. ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ పోర్టల్‌ ద్వారా గనుల శాఖ వేలం ప్రక్రియ నిర్వహించనుంది. తొలివిడతగా ఈ నెలలో 200 లీజులకు ఈ–వేలం నిర్వహించి అనుమతులు మంజూరు చేయడానికి ఏర్పాట్లు చేశారు. గనుల రంగంలో ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణల్లో భాగంగా చిన్నతరహా ఖనిజాలకు ఈ–వేలం ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆసక్తి గల వ్యక్తులు, సంస్థలు ఎవరైనా ఈ–వేలంలో పాల్గొనేందుకు వీలుగా గనుల శాఖ ఆదేశాలు జారీ చేసింది.ఈ–వేలం నిర్వహించే లీజుల వివరాలు, అవసరమైన టెండర్‌ పత్రాలు ఈ నెల 12వ తేదీ నుంచి ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ పోర్టల్‌ https://tender.apeprocurement.gov.inలో అందుబాటులో ఉంచుతారు. లీజులకు సంబంధించిన పూర్తి వివరాలను  https://www.mines.apgov.in/ miningportal లద్వారా తెలుసుకోవచ్చు. ఈ–వేలంలో ఎక్కువ మొత్తానికి బిడ్‌ కోట్‌ చేస్తారో ఆ బిడ్డర్‌ (ప్రిఫర్డ్‌ బిడ్డర్‌) తాను కోట్‌ చేసిన మొత్తాన్ని 15 రోజుల్లో గనుల శాఖకు చెల్లించాల్సి ఉంటుంది.ఈ సొమ్ము చెల్లించిన వెంటనే వారికి లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ జారీ చేస్తారు. ఆ తర్వాత బిడ్డర్‌ తాను కోట్‌ చేసిన క్వారీకి సంబంధించిన మైనింగ్‌ ప్లాన్, పర్యావరణ అనుమతి, సీఎఫ్‌ఈ సమర్పించిన వెంటనే లీజులు మంజూరు చేస్తారు.తొలివిడతలో 200 లీజులకు ఈ–వేలం ద్వారా అనుమతులు మంజూరు చేస్తాం. ఎక్కడా అనవసర జాప్యం లేకుండా, పారదర్శకంగా లీజుల జారీ ప్రక్రియ ఉంటుంది. ఇప్పటివరకు మైనింగ్‌ రంగంలోకి రావాలనే ఆసక్తి ఉండి, అవకాశాలు దక్కని వారు ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఈ విధానం ద్వారా మైనింగ్‌ రంగంలోకి ప్రవేశించేందుకు అవకాశం ఏర్పడుతుంది.

Related Posts