YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

రియాల్టీ షోలో గ్లామర్ డోస్

రియాల్టీ షోలో గ్లామర్ డోస్

బుల్లితెర‌పై సెన్సేష‌న్ క్రియేట్ చేసిన రియాలిటీ షో బిగ్ బాస్‌. ఎన్టీఆర్ హోస్ట్‌గా సీజ‌న్ 1 ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగింది. ఇక ప్ర‌స్తుతం సీజ‌న్ 2కి ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. న్యాచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించనున్న సీజన్ 2 కోసం అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా భారీ సెట్‌ను కూడా వేస్తున్నారు. ఈ షో కోసం నానికి బిగ్‌బాస్ 2 మేకర్స్ రూ.4 కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వ‌నున్నార‌ని ఫిలింన‌గ‌ర్ టాక్. బిగ్‌బాస్ 2 సెట్‌లో కంటెస్టంట్స్ కోసం అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారట.  తెలుగులో 'బిగ్ బాస్-2' రియాల్టీ షో ఎంతగానో ఆలరించింది. ఈ షో వ్యాఖ్యాతగా ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించారు. ఇందులో అనేకమంది బుల్లితెర నటీనటులు పాల్గొన్నారు. ఇపుడు 'బిగ్ బాస్-2' సీజన్ ప్రారంభంకానుంది. ఇందుకోసం భారీ సెట్‌ను కూడా సిద్ధం చేశారు. దీనికి 'బిగ్ బాస్-2'ను హీరో జూనియర్ ఎన్టీఆర్ కాకుండా నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేయనున్నాడనే ప్రచారం జరుగుతోంది.ఇదిలావుంటే... ఈ షోకు సంబంధించి మరో ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. సీజన్-1 కంటే సీజన్-2 మరింత గ్లామరస్‌గా ఉండబోతోందనే వార్త ఫిల్మ్ నగర్‌లో గుప్పుమంది. ఈ నటీమణుల జాబితాలో సీనియర్ నటి రాశి, 'స్టూడెంట్ నంబర్ 1' హీరోయిన్ గజాలా, తేజస్వితో పాటు.. సింగర్ గీతా మాధురి, యాంకర్ శ్యామలలు పాలుపంచుకోనున్నట్టు తెలుస్తోంది. జూన్ నుంచి సీజన్ 2 షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తుండ‌గా, సీజన్ 2లో వంద ఎపిసోడ్స్ ఉండనున్నాయి అంటున్నారు. అయితే సీజ‌న్ 2పై జ‌నాల‌లో మ‌రింత ఆస‌క్తి క‌లిగించేందుకు గ్లామ‌ర్ బ్యూటీస్‌ని కంటెస్ట్‌లుగా తీసుకోనున్నార‌ని టాక్. 

Related Posts