అమరావతి
బాపట్ల జిల్లా తీరప్రాంతంలో అసాని తుపాను ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. బాపట్లలో 8 సెం.మీ., వేటపాలెంలో 5.54 సెం.మీ. వర్షపాతం నమోదు అయింది. బాపట్ల, రేపల్లె, నిజాంపట్నంలో వర్షంభట్టిప్రోలు, కొల్లూరు మండలాల్లో వర్షం దంచికోట్టింది. తుపాను తీవ్రత దృష్ట్యా అప్రమత్తమైన అధికారులు తగిన హెచ్చరికలు చేసారు. నిజాంపట్నం హార్బర్లో 8వ నంబర్ ప్రమాద హెచ్చరిక ను ఎగురవేసారు. బాపట్ల కలెక్టరేట్, తీర ప్రాంత మండలాల్లోని తహశీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లుఏర్పాటు చేసారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు ఆదేశాలు జారీ చేసారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో మంగళవారం రాత్రి నుంచి విద్యుత్ నిలిచిపోయింది. తుపాను ప్రభావంతో గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేసారు. రొయ్యల చెరువుల రైతులకు డీజిల్ దొరక్క ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. కరెంటు లేక గంటకు 6 లీటర్ల చొప్పున జనరేటర్కు డీజిల్ వినియోగం అవుతోంది. రొయ్యల చెరువులు కాపాడుకునేందుకు రైతుల ఇబ్బందులు పడుతున్నారు. మైపాడు బీచ్ వద్ద సముద్రం 10 మీటర్లు ముందుకొచ్చింది. నెల్లూరు జిల్లావ్యాప్తంగా ఈదురుగాలులతో వర్షం కురిసింది.
కడపలో భారీ వర్షాలు
అసని తుఫాను ప్రభావంతో కడప జిల్లాలోబుధవారం భారీ వర్షాలు కురిసాయి. దాంతో కడప నగరంలోని లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో కాలువులు పొంగిపొర్లుతున్నాయి. రోడ్ల పైకి భారీ వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ బస్టాండ్ గ్యారేజిలోకి భారీ వర్షం నీరు చేరింది. ప్రతిసారి వర్షం పడితే ఇదే పరిస్థితి ఏర్పడుతుందని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.