YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

డబుల్ చీర్స్ తో బీర్స్

 డబుల్ చీర్స్ తో బీర్స్

మండువేసవిలో మద్యం ప్రియులు బీర్లతో దాహం తీర్చుకుంటున్నారు. గత వేసవితో పోల్చితే ఈ వేసవితో బీర్ల అమ్మకాలకు విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. అనేక మద్యం దుకాణాల్లో బ్రాండ్ బీర్లకు కొరత ఏర్పడింది. 330 ఎంఎల్ బీర్లకు యువత నుంచి భారీ గిరాకీ ఉన్నదని, ఈ ఏడు మార్చి నుంచే అధికంగా అమ్ముడవుతున్నాయని దుకాణదారులు పేర్కొంటున్నారు. సాధారణంగా వేసవిలో బీర్లకు డిమాండ్ బాగా ఉంటుంది. నగరంలోని బార్లు, పబ్‌లలో టీనేజర్ల జోష్‌ పెరిగింది. కలర్‌ జిరాక్స్‌లతో ఫేక్‌ ఐడీలు సృష్టిస్తున్న వీరు... మధ్యాహ్నం బార్లు, రాత్రిళ్లు పబ్‌లలో ఎంజాయ్‌చేస్తున్నారు. ఇటీవల ఆబ్కారీ శాఖ కొన్ని పబ్‌లలోతనిఖీలు నిర్వహించగా... అక్కడ 60 శాతం టీనేజర్లే ఉన్నట్లు తేలింది. 21 ఏళ్లలోపు యువతీ యువకులకు మద్యం విక్రయించడం, సరఫరా చేయడం చట్టరీత్యా నేరం. దీంతో దాదాపు ఏడు పబ్‌లకు ఆబ్కారీ శాఖ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. మరోవైపు వేసవిలో బీర్ల విక్రయాలు ఊపందుకున్నాయి. నిత్యం సుమారు 1.30 లక్షల లీటర్ల బీర్‌ను యూత్‌ తాగేస్తోంది. గత ఐదేళ్లతో పోలిస్తే ఈసారి 30వేల లీటర్లు అదనంగా పెరగడం గమనార్హం. యూత్‌ జోష్‌తో గ్రేటర్‌లోని బార్లు, పబ్‌లలో బీర్ల సేల్స్‌ ఊపందుకున్నాయి. పలువురు టీనేజ్‌ యువత పగలు బార్లు.. రాత్రిళ్లు పబ్‌లకు వెళుతూ ఫుల్లు జోష్‌లో మునిగితేలుతున్నట్లు ఆబ్కారీశాఖ పరిశీలనలో తేలింది. ప్రధానంగా 21 ఏళ్లలోపు యువత కొందరు నకిలీ ఐడీ కార్డులను సృష్టిస్తుండగా.. మరికొందరు ఇతరుల ఐడీకార్డులను కలర్‌జిరాక్స్‌ తీసి తమ వయస్సు 21 ఏళ్ల కన్నా అధికంగా ఉన్నట్లు చూపుతూ బార్లు, పబ్‌ల్లోకి ప్రవేశిస్తున్నట్లు స్పష్టమైంది. ఇక పలు బార్లు, పబ్‌ల యజమానులు ఈ ధ్రువపత్రాలను సైతం సరిగా పరిశీలించడం లేదని తేలడం గమనార్హం.   అయితే గతంతో పోల్చితే ఈ వేసవిలో ఈ డిమాండ్ అధికంగా ఉంది. గత వేసవిలో హైదరాబాద్ శివారులోని బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్‌బీసీఎల్) డిపోనుంచి లక్షన్నర కేసుల బీర్లు అమ్ముడవగా, ఈసారి అదే డిపో నుంచి రెండున్నర లక్షల బీర్ కేస్‌లు విక్రయించారు. గిరాకీ బాగా పెరుగడంతో డిస్టిలరీస్‌లలో బీర్ల కొరత బాగా ఏర్పడింది. డిమాండ్‌కుఅనుగుణంగా తయారీ సామర్థ్యాన్ని కూడా పెంచే యత్నంలో బేవరేజస్ కార్పొరేషన్ ఉన్నట్టు తెలిసింది.డిస్టిలరీలో తయారుచేసిన బీర్లను కనీసం 20 రోజులు కోల్డ్ స్టోరేజ్‌లో నిల్వ ఉంచి, ఈ తరువాత దుకాణదారులకు పంపిణీ చేస్తారు. అయితే, ప్రస్తుతం డిమాండ్ బాగా పెరిగి బీర్ల కొరత ఉండడంతో తయారీ చేసిన వెంటనే మార్కెట్‌లోకి వస్తున్నాయని మద్యం దుకాణాల యజమానులు చెప్తున్నారు. కోల్డ్ స్టోరేజ్‌లో ఉంచకపోవడంతో లోడింగ్, అన్ లోడింగ్ సమయంలో అనేక బాటిళ్లు డ్యామేజ్ అవుతున్నాయని వారు పేర్కొంటున్నారు. బీర్లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని అందుకనుగుణంగా వాటి తయారీని పెంచాలని తెలంగాణ వైన్స్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డీ వెంకటేశ్వర్‌రావు కోరారు.

Related Posts