పార్వతీపురం
విశాఖపట్నం నుంచి ఢిల్లీలోని హజ్రత్ నిజాజముద్దిన్ వెళ్లే సమత సూపర్ ఫాస్ట్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. మన్యం జిల్లాలోని గుచ్చిమి రైల్వే గేట్ సమీపంలో ఇంజన్ బోగి విడిపోయింది. సుమారు కిలోమీటర్ పైగా బోగీలను విడిచి ఇంజన్ వెళ్లిపోయింది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురైయారు. విషయం తెలుసుకున్న లోకోపైలెట్ ఇంజన్ ను తిరిగి బోగీల దగ్గరకు తెచ్చి అనుసంధానించారు. ఈ సమస్య కారణంగా సమతా ఎక్స్ ప్రెస్ రైలు సుమారు గంటసేపు నిలిచిపోయింది.