YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తుఫాన్ పై సీఎం జగన్ సమీక్ష

తుఫాన్ పై సీఎం జగన్ సమీక్ష

అమరావతి
రాష్ట్రంలో అసనీ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం నాడు  తుఫాను ప్రభావిత కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ఈ సమీక్ష జరిపారు. అసని' తుపాను బలహీనపడటం ఊరటనిచ్చే అంశమని  అయనఅన్నారు.  తుఫాను నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై పలు ఆదేశాలు జారీ చేశారు. తుఫాను నేపథ్యంలో హై అలర్ట్గా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే నిధులిచ్చామని చెప్పారు. తీర ప్రాంతాల్లో అప్రమత్తం అవసరమని తెలిపారు. తుఫాను తీరం వెంబడి ప్రయాణిస్తోంది కాబట్టి తీర ప్రాంతాల్లో మరింత అప్రమత్తం అవసరమన్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. తుఫాను బలహీనపడటం ఊరటనిచ్చే అంశమన్నారు. ఎక్కడా నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని స్పష్టం చేశారు.అవసరమైన చోట సహాయ, పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. సహాయ శిబిరాలకు తరలించిన వ్యక్తికి రూ.1000, కుటుంబానికి రూ.2వేలు చొప్పున ఇవ్వండని జగన్ అధికారులకు చెప్పారు. సహాయ శిబిరాల్లో మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. జనరేటర్లు, జేసీబీలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

జిల్లా అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలి,
నెల్లూరు కలెక్టరేట్ లోని ఎస్.ఆర్. శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో  "అసని" తుఫాను నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మాత్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాను ఈ కారణంగా జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం సంభవించకుండా జిల్లా అధికార యంత్రాంగం తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు నిరంతరం గ్రామీణ ప్రాంతాల పరిస్థితిపై సమీక్షించాలి అన్నారు.. విద్యుత్, ఫైర్, పోలీస్, పురపాలక శాఖ, మండల స్థాయి అధికారులు ప్రతి ఒక్కరు సమిష్టిగా పనిచేయాలని ఆదేశించారు. సహాయక కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై మంత్రి జిల్లా అధికారులకు పలు సూచనలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చక్రధర బాబు, జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ నెల్లూరు నగర కార్పొరేషన్ కమిషనర్ జాహ్నవి, ఏఎస్పీ వెంకటరత్నం విఆర్వో వెంకట రమణమ్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

జిల్లా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలి
తుఫాన్ నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం ప్రజలకు అన్ని విధాల సహాయక చర్యలు చేయుటకు సిద్దంగా ఉండాలని, ముమ్మరంగా విజబుల్ పోలీసింగ్ చేయాలని జిల్లా ఎస్పీ విజయా రావు ఆదేశించారు. రెవెన్యూ, మున్సిపల్/గ్రామ పంచాయతీ అధికారుల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలి. ప్రజల సహాయార్థం, సహాయక చర్యల కోసం పోలీసు సిబ్బంది 24x7 అందుబాటులో ఉండాలి. నదులు, వాగులు, వంకలు, చెరువులు, జలాశయాలు మరియు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో సురక్షితంగా ఉండేలా రెవిన్యూ అధికారుల సహాయంతో చర్యలు చేపట్టాలి. బలమైన గాలులు వీస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా చెట్లు, విధ్యుత్ స్థంబాలు మరియు రేకుల షెడ్ లు ఎగిరి ప్రజలకు, ప్రజా రవాణా వ్యవస్థకు ఇబ్బంది కలగకుండా చూడాలి. రోడ్లపై విరిగిన చెట్లను వెంటనే తొలగించేలా చర్యలు చేపట్టాలి.  జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో తుఫాన్ సహాయక చర్యల కొరకు పోలీసు, ఎస్డీఆర్ఎఫ్  ప్రత్యేక బృందాలను సిధ్దంగా ఉండి సహాయక చర్యలు చేపడుతున్నాయి.  తుఫాన్ వలన ఏమైనా ఘటనలు తలెత్తినా, అత్యవసర పరిస్థితి వచ్చినా, సమస్యలకు గురైనా ప్రజలు, వెంటనే డయల్ - 100 లేదా పోలీసు కంట్రోల్ రూమ్ వాట్స్ యాప్ నంబర్  +91 9392903413 కు సమాచారం తెలిపితే సహాయ చర్యలు చేయడానికి నెల్లూరు జిల్లా పోలీస్ యంత్రాగం 24x7 అందుబాటులో వుంటుందని అయన  తెలిపారు.

Related Posts