YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విజయవాడలో కదులుతున్న డ్రగ్స్ దందా

విజయవాడలో కదులుతున్న డ్రగ్స్ దందా

విజయవాడ, మే 11,
విజయవాడ లో సంచలనం కలిగించిన డ్రగ్స్‌ ప్యాకెట్‌ కొరియర్‌ ఘటనలో పోలీసులు ముందడుగు వేశారు. చెన్నైకి  చెందిన అరుణాచలం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నగర డీసీపీ మేరీ ప్రశాంతి వివరాలు వెల్లడించారు. విజయవాడ నుంచి కొరియర్‌ ద్వారా ఆస్ట్రేలియాకు ఎఫిడ్రిన్‌ అనే డ్రగ్‌ను పంపించిన ఘటన తెలిసిందే. విజయవాడ నుంచి పార్శిల్ ను కొరియర్‌ చేసిన అరుణాచలాన్ని చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు. చెన్నై బర్మా బజార్ లో అరుణాచలం పని చేస్తాడని డీసీపీ చెప్పారు. నాలుగు బృందాలుగా ఏర్పడి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.ఓ యువకుడి ఆధార్‌ కార్డ్ ను ఫోర్జరీ చేసి, అరుణాచలం ఈ నేరానికి పాల్పడ్డాడు. ఆధార్ ఫోర్జరీపై విజయవాడ పోలీసులకు బాధిత యువకుడు ఫిర్యాదు చేశాడు. నిందితుడు అరుణాచలాన్ని ఫోర్జరీ కేసులో అరెస్ట్‌ చేశాం. చెన్నై నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చి, విజయవాడ నుంచి కొరియర్‌ ద్వారా సప్లై చేశారు. విజయవాడ నుంచి కొరియర్‌ ద్వారా మాత్రమే పంపారు. మరో ఇద్దరి పాత్రపైనా విచారణ చేస్తున్నాం.విజయవాడలో మరోసారి మత్తు పదార్థాలు బయటపడటం సంచనలనంగా మారింది. గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి ప్రాంతానికి చెందిన సాయిగోపి అనే వ్యక్తి పంపిన పార్శిల్‌లో డ్రగ్స్‌ ఉన్నట్లు బెంగళూరులో గుర్తించారు. పార్శిల్ గురించి ఆరా తీయగా విజయవాడ డీటీఎస్ నుంచి సరైన వివరాలతో కెనడాకు వెళ్లినట్లు గుర్తించారు. పార్శిల్ లో నాలుగు కిలోల మత్తు పదార్థాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనకు పాల్పడిన కొరియర్ బాయ్‌ తేజను గత నెల 27న బెంగళూరు పిలిపించి విచారించారు. అనంతరం అతడిని అరెస్టు చేశారు. పట్టుబడిన పార్శిల్‌లో పిరిడిన్‌ అనే నిషేధిత డ్రగ్‌ను గుర్తించారు. అనంతరం కస్టమ్స్‌ అధికారులు విజయవాడ పోలీసులకు సమాచారం అందించారు. డ్రగ్స్ కలకలం రేగడంతో స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు.

Related Posts