YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆళ్లగడ్డ లో భారీ వర్షం... నేలకొరిగిన పంటలు

ఆళ్లగడ్డ లో భారీ వర్షం... నేలకొరిగిన పంటలు

ఆళ్లగడ్డ
ఆళ్లగడ్డ పరిధిలో గురువారం  భారీ వర్షం కురిసింది.. బలమైన ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది.. దీంతో సాగులో ఉన్న  వరి, మొక్కజొన్న వంటి పంటలు నేలకొరిగాయి.. భారీ వర్షం, ఈదురు గాలులు ,పిడుగుల శబ్దంతో  ప్రజలు రాత్రంతా  తమ ఇళ్లల్లో బిక్కుబిక్కుమంటూ గడిపారు. నియోజకవర్గంలో అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో విద్యుత్ సరఫరా లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. అసని తుఫాన్  రైతన్నల ఆశలకు ఆశనిపాతం గా మారింది. ముఖ్యంగా చేతికొచ్చిన పంటలను చిద్రం చేసింది. రహదారులపై ఆరబోసిన పంటలు దెబ్బతింటున్నాయి. ఈ వర్షం మరి కొన్ని రోజుల పాటు పడతాయని వస్తున్న సమాచారంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

Related Posts