తిరుపతి
తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పండుగలా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నామని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి అన్నారు. ఏర్పేడు మండలం పల్లం, పల్లంపేట, పల్లం గొల్లపల్లిలో ఆయన పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గడపగడపకు వెళ్తున్నప్పుడు సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ప్రజలు చూపిస్తున్న అభిమానం చూస్తుంటే తనకు ఎనలేని సంతోషం కలిగించిందన్నారు. ముఖ్యమంత్రి ప్రతి ఒక కుటుంబంలో సంక్షేమ పథకం ద్వారా సంతోషాన్ని నింపుతున్నారని కొనియాడారు.
వెల్లువెత్తిన ప్రజా స్పందన,
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్ర మంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలోని, పోలంపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వవిప్, స్థానిక శాసనసభ్యుడు సామినేని ఉదయభాను పర్యటించి ప్రభుత్వ పనితీరును స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ గ్రామంలో ఏ ఒకరు ప్రభుత్వ పధకాలు మీద గానీ, ప్రభుత్వ విధానాలు మీద ఎక్కడ అసంతృప్తితో లేరని,వైఎస్సార్ ప్రభుత్వం విధానాలు పట్ల ప్రజలు పూర్తి సంతృప్తి గా ఉన్నారు అని, ఏ పెద్దాయన ను ఆడిగిన గతంలో కర్ర పట్టుకొని పంచాయతీ ఆఫీసు ముందు పడిగాపులు కాస్తే క్యూలో నిలబడితే ఫీంచన్,రేషన్ సరకులు ఇచ్చే వారని ఇప్పుడు తెల్లవారుజామున మేము కూడా లేగవముందే తలుపులు తట్టి వాలంటీర్స్ అన్ని పధకాలు అందిస్తున్నారు అన్ని ఇది అది కాదు ప్రభుత్వం చేపట్టిన ప్రతి పధకం గ్రామంలో అర్హులైన వారందరికీ అందుతున్నాయి అని టీడీపీ కార్యకర్తలు సైతం ఒప్పుకునే పరిస్థితి ఉందని,ఈ రోజు గ్రామాల్లో పర్యటిస్తూ వారి ముఖాలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని అన్నారు