నంద్యాల
నంద్యాల జిల్లా కేంద్రంలో నాన్ జ్యూడీషియల్ స్టాంపుల బ్లాక్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో పెద్ద సంఖ్యలో వీటి విక్రయ దారులు అన్నింటినీ రెట్టింపు ధరలకు విక్రయిస్తూ ప్రజలను నిలువునా దోచుకుంటున్నారు. ఆస్తుల క్రయ విక్రయాలు బ్యాంకులకు మార్టిగేజ్. దుకాణాల ఒప్పందాలకు. ఇతర ముఖ్య లావాదేవీలకు నాన్ జుడీషియల్ స్టాంపులు తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది. ప్రతి రోజూ వందల సంఖ్యలో ప్రజలు వివిధ అవసరాల నిమిత్తం వాటిని కొనుగోలు చేస్తుంటారు. వాటిని విక్రయించే లైసెన్సు స్టాంపు వెండర్లు100 రూ. స్టాంపును రూ 150 కి. 10.రూ 30.కి. 20 స్టాంపు రూ 40.కి విక్రయిస్తున్నారు. అదేమని ప్రశ్నిస్తే నీ ఇష్టం ఉంటే కొను లేకుంటే వెళ్లిపో అంటున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు అన్ని చోట్ల రెట్టింపు ధరలకు అమ్ముతున్నారని ప్రజల వాదనలు. అలాగే గడువు తీరిన పాత నాన్ జ్యూడిషియల్ స్టాంపులను కూడా అవసరాన్ని బట్టి వేళల్లో విక్రయాలు జరుగుతున్నాయని పలువురు అంటున్నారు. ఇవే స్టాంపులు స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అందుబాటులో ఉంటున్న సకాలంలో దొరక్క పోవడంతో ప్రజలు ఎక్కువ ధరలకు బయట కొనుగోలు చేయాల్సి వస్తోందని ప్రజలు అంటున్నారు .