పెనుగొండ
పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.. ఆర్య వైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ నగరేశ్వరి మహిషాసుర మర్దిని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో లో వాసవి జయంతి వేడుకలు ఘనంగా ముగిశాయి.. అమ్మవారికి పంచామృత అభిషేకాలు అర్చనలు ఘనంగా నిర్వహించారు ఆలయ అర్చకులు.. కర్ణాటక ,కేరళ కోయంబత్తూర్ జిల్లా నుంచి విచ్చేసిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పెనుగొండ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో 102 రకాల స్వీట్లను అమ్మవారికి సమర్పించారు ..ఈ కార్యక్రమంలో భాగంగా వాసవి అమ్మవారు మేళతాళాలతో, కాళికామాత నృత్యాలతో వెండి రథంపై గ్రామ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు.. అమ్మ వారి రథోత్సవం లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ భక్తిశ్రద్ధలను చాటుకొన్నారు