న్యూ డిల్లీ మే 12
కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి ప్రధాన కమిషనర్‌గా రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం ప్రధాన కమిషనర్‌గా ఉన్న సుశీల్ చంద్ర పదవీ కాలం ఈ నెల 14 తో ముగియనుంది. ఈ నెల 15 న నూతన ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌గా రాజీవ్ కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.రాజీవ్ కుమార్ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఏప్రిల్ మాసంలో ఈ పదవికి ఆయన రాజీనామా చేశారు. చాలా సంవత్సరాలుగా ఆయన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ముందు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వంలో ఓ థింక్ ట్యాంక్‌గా ఉంటూ వస్తున్నారు.నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా అరవింద్ పణగారియా దిగిపోయిన తర్వాత రాజీవ్ కుమార్ ఈ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు పూణెలోని గోఖలే ఇనిస్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ అండ్ ఎకనామిక్స్‌కి ఛాన్సలర్‌గా ఉన్నారు. అలాగే లక్నోలోని గిరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ స్టడీస్‌కి బోర్డ్ ఆఫ్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.