కడప, మే 13,
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కు అసలు సూత్రధారిని సీబీఐ కనిపెట్టారని.. ఆ సూత్రధారికి సంబంధించిన ఆధారాల కోసమే ఆగుతున్నారన్న ప్రచారం పులివెందులలో విస్తృతంగా జరుతోంది. వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను అరెస్ట్ చేస్తే కేస్ క్లోజ్ అయిపోతుందనుకుంటే… జగన్ ఎప్పుడో చేయనిచ్చేవారని.. కానీ ఆ కేసు తర్వాత ఓ శివగామి వద్దకు వస్తుందనే .. కేసును ముందుకు వెళ్లకుండా చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయం కడప జిల్లాలో సంచలనంగా మారింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మొదటి నుంచి సంచలనాత్మకంగా మారింది. ఎందుకంటే అంతా బహిరంగమే .. కానీ ఒక్కరూ బయటకు చెప్పరు. ఎవరు చేశారు.. ఎలా చేశారు.. ఎందుకు చేశారు.. అంతా ఓపెన్ సీక్రెట్. కడప ప్రజలందరూ.. తమ పిచ్చాపాటి కబుర్లులో అసలు హంతకులెవరో చెప్పుకుంటూ ఉంటారు. అయితే కేసులు పెట్టడానికి అరెస్ట్ చేయడానికి కావాల్సింది సాక్ష్యాలు. ఈ విషయంలో అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలను అరెస్ట్ చేయడానికి కావాల్సిన సాక్ష్యాలున్నాయి. కానీ ఇంకా అరెస్ట్ చేయడం లేదు. సీబీఐ అధికారులు వివేకా హత్య కేసుకు సంచలన ముగింపు ఇవ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.అందుకే ఈ హత్య కేసులో అసలు సూత్రధారిని బయటకు తీయాలని పట్టుదలగా ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఇది బయటపడితే రాజకీయంగానూ సంచలనం అవుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి సీబీఐ సైలెంట్‌గా ఉంది.. ఏం చేస్తుందనేది ఎవరికీ తెలియడంలేదు. కానీ వీరోచితంగా ముందడుగా వేసి… వైఎస్ వివేకా హత్య కేసు నిందితుల్ని పట్టుకోవాలంటే.. సంచలనాలు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది.