YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం

సిరిధాన్యాలతో కేన్సర్‌ను జయిద్దాం

 సిరిధాన్యాలతో కేన్సర్‌ను జయిద్దాం

- విషతుల్యమైన ఆహారమే కారణం..

ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని ఏళ్ల క్రితం వెబ్‌సైట్‌లో ఉంచిన సమాచారం ప్రకారం.. 2030 నాటికి కోటి 40 లక్షల నుంచి రెండు కోట్ల 10 లక్షల మంది వరకు కేన్సర్‌ బారిన పడే పరిస్థితి నెలకొంది.  దీనికి ప్రధాన కారణం.. ప్రతి రోజూ మనం తింటున్న విషతుల్యమైన ఆహారమే! ఇప్పుడు తింటున్న ఆహారం మరింత విషపూరితంగా మారిపోతోంది.1970–80 దశకానికి ముందు కాలంలో కేన్సర్‌ రోగులు చాలా అరుదుగా కనిపించేవారు. బహుశా లక్ష జనాభాలో ఏ ఒక్కరికో వచ్చేది. ఇప్పుడు ఎటు చూసినా కేన్సర్‌ రోగులు కనిపిస్తున్నారు. 

పురుగు మందులు
జనాభా పెరుగుతున్న కొద్దీ అధికంగా ఆహారం ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ కారణంగా అధిక దిగుబడి కోసం రసాయనిక ఎరువులు, చీడపీడల నుంచి పంటలను కాపాడుకోవడానికి పురుగుమందులు, తెగుళ్ల మందుల వాడకం ప్రారంభమైంది. గతంలో రసాయనిక ఎరువులు, పురుగుమందులు ఎమల్షన్‌ రూపంలో నీటిలో కరగని రీతిలో ఉండేవి. తదనంతరం, నీటిలో కలిసిపోయే రకం పురుగుమందులను శాస్త్రవేత్తలు తయారు చేశారు. అమెరికాలో జన్యుమార్పిడి సోయాబీన్స్‌ను ఉత్పత్తి చేసే క్రమంలో జరిపిన ప్రయోగ ఫలితాలను బట్టి శాస్త్రవేత్తలకు ఈ ఆలోచన వచ్చింది.  

కలుపు మందులు
సోయాబీన్స్‌ పొలంలో మొలిచే కలుపు మొక్కలను నిర్మూలించేందుకు శాస్త్రవేత్తలు కలుపు నివారణ మందులను తయారు చేశారు. అయితే, ఈ కలుపు మందులు వాడినప్పుడు ప్రధాన పంట కూడా దెబ్బతిన్నది! ఈ కలుపుమందుకు 2–4–డి. దీనికి ‘ఏజెంట్‌ ఆరెంజ్‌’ అనే మరో పేరు కూడా ఉంది. మొక్కలు చూస్తుండగానే మాడిపోయేలా చేయడానికి దీన్ని వియత్నాం యుద్ధంలో వాడారు. సోయాబీన్‌ పంటను కలుపు మందు నుంచి కాపాడుకోవడానికి.. కలుపు మందును తట్టుకొని నిలిచేలా సోయాబీన్స్‌కు జన్యుమార్పిడి చేశారు! ఆ విధంగా రసాయనం సోయాబీన్‌ పంటలోకి చేరింది. ఈ రసాయనం క్రమంగా ఫెనోలిక్‌ కాంపౌండ్‌గా రూపుదాల్చి, కొంత మేరకు నీటిలో కరిగే స్వభావాన్ని సంతరించుకుంది. దీన్ని గ్రహించిన శాస్త్రవేత్తలు ఆ తర్వాత నీటిలో కరిగే స్వభావం కలిగిన ‘గ్లైఫొసేట్‌’ వంటి కలుపు మందులను కనుగొన్నారు.

Related Posts