YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎస్సై ఆత్మహత్య

ఎస్సై ఆత్మహత్య

కాకినాడ
కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ ఐ గోపాల కృష్ణ గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం నాడు ముఖ్యమంత్రి పర్యటన బందోబస్త్ కి వెళ్ళి వచ్చిన గోపాలకృష్ణ శుక్రవారం  తెల్లవారుజామున ఇంట్లో గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడు 2014 సంవత్సరం బ్యాచ్ కుచెందిన ఎస్సై.   తెల్లవారుజామున 5 గంటలకు ఒక గదిలో పిల్లలు భార్య నిద్రిస్తుండగా హాల్లో గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.  గోపాలకృష్ణకు భార్యా ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాకినాడ జీజీహెచ్ మార్చురీలో ఎస్ఐ గోపాలకృష్ణ మృతదేహన్ని ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు, ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పరిశీలించారు.ట్రైనింగ్ పూర్తయ్యాక కొన్నాళ్ళు ట్రాఫిక్ విభాగంలో గోపాలకృష్ణ విధులు నిర్వహించారు. ఆ తర్వాత స్టేషన్ బాధ్యతలు ఇవ్వకుండా సర్పవరం సర్కిల్లో పోస్టింగ్ వేశారు. అధికారుల తీరుపై కొన్నాళ్లుగా ఎస్ఐ గోపాలకృష్ణ మనస్తాపంతో బాధపడుతున్నాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు.  

ఎస్సై ఆత్మహత్య కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు,
సర్పవరం ఎస్ఐ గోపాలకృష్ణ ఆత్మహత్య విషయంపై కాకినాడ ఎస్డీపివో భీమారావు స్పందించారు. కొన్ని టీవీ ఛానల్ లలో “పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తున్న పోలీసు అధికారులన్న వార్తాలను అయన ఖండించారు. మృతుడు గోపాల్ కృష్ణ 2014 బ్యాచ్ ఎస్సై గా సెలెక్ట్ అయ్యారు.  అప్పటినుండి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డొంకరాయి, సర్పవరం, రాజోల్, కాకినాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లలో పనిచేసి ప్రస్తుతం సర్పవరం పోలీస్ స్టేషన్ లో గత యేడాది ఆగస్తునుంచి విధి నిర్వహణ చేస్తున్నారని అన్నారు.   అతని ఆత్మహత్యకు సంబంధించి అన్ని కోణాల్లో  విచారణ చేపట్టామని అన్నారు.ప్రాధమిక విచారణలో మృతుడు ఎంసియే  పూర్తీ చేసి  సాఫ్ట్ వేర్  ఉద్యోగం చేస్తూ ఎస్సై  ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యారు.  అయన మొదటి నుంచి తన తోటి ఎస్సైలో తనకు సాఫ్ట్ వేర్ ఉద్యోగం అంటేనే ఇష్టమని, అనవసరంగా ఆ ఉద్యోగం వదిలి ఎస్సై  ఉద్యోగానికి వచ్చానని బాధపడుతూ ఉండేవాడని తెలిసింది. పూర్తి స్థాయి విచారణ అనంతరం వివరాలు వెల్లడించడం జరుగుతుందని అన్నారు.   ఎస్.ఐ.  ఆత్మ హత్య విషయం గురించి అవాస్తవాలు, పుకార్లను ప్రసారం చేయవద్దని అయన అన్నారు.

Related Posts