YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గడపగడపకు వైసిపి అంటూ వచ్చే నాయకులను నిలదీయండి

గడపగడపకు వైసిపి అంటూ వచ్చే నాయకులను నిలదీయండి

బద్వేలు
బద్వేల్ పట్టణంలోని  సిద్ధవటం రోడ్డు లో గల తన కార్యాలయంలో శుక్రవారం  రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ మహబూబ్ భాష   ప్రకటన విడుదల చేస్తూ గడపగడపకు వైసిపి అంటూ వచ్చే నాయకులను ముస్లిం సోదరులు నిలదీయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలుపుతూ
పేదలు ఆనందంగా పండుగ జరుపుకోవడానికి రంజాన్ తోఫా వచ్చేది.మీరు వచ్చిన తర్వాత ఎక్కడ?
మా పేద అమ్మాయిల వివాహాలకు చంద్రబాబు  దుల్హన్ 50000 ఇస్తుంటే లక్ష రూపాయలు  ఇస్తామన్నారు. మూడు సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి అయినా ఎవరికైనా ఇచ్చారా?
ముస్లిం సోదరులలో ఎక్కువగా చేతివృత్తుల వారు ఉన్నారని వారి జీవితాల్లో వెలుగులు నింపాలని గౌరవ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా లక్ష రూపాయల సబ్సిడీతో రెండు లక్షల రూపాయల రుణాలు ఇచ్చేవారు. ఈ మూడేళ్లలో ఒకరికన్నా మీరు ఇచ్చారా?
విదేశాల్లో చదువుకునే ముస్లిం విద్యార్థినీ విద్యార్థుల కోసం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు 15 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్నారు. మీరు ఏ ఒక్కరికైనా ఒక్క రూపాయి ఇచ్చార? ముస్లిం సోదరీ మణుల కోసం కుట్టు శిక్షణ కేంద్రాలు పెట్టి ఉచితంగా కుట్టు మిషన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానిది. మీరు ఏ ఒక్కరికైనా ఇచ్చారా?
ప్రమాదవశాత్తు ముస్లిం మైనార్టీలకు చెందిన వారు మరణిస్తే వైయస్సార్ భీమా ద్వారా 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఉన్న చంద్రన్న బీమా తీసేశారు. ఈ మూడేళ్లలో ఒకరినైనా ఆదుకున్నార?
ముస్లింలకు సబ్ ప్లాన్ ఇస్తామన్నారు. ఎక్కడ?
ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసి వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. ఎక్కడ ఇచ్చారు?
ఈ మూడేళ్లలో ఒక్క షాదీఖానా గాని, ఒక్క మద్రసాకు గాని, ఒక్క మసీదు నిర్మాణానికి గాని, ఒక్క ఖబరస్తాన్ ఆధునీకరణకు గాని ఒక్క రూపాయి ఇచ్చారా?
ఇమామ్ మౌజనులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టిస్తామని అన్నారు. ఎక్కడ? ఒకరికైనా ఇచ్చారా?
హజ్ యాత్ర చేసే ముస్లిం సోదరులకు ఆర్థిక సహాయం చేస్తామన్నారు. ఎవరికైనా చేశారా?
మీరు వస్తే ఇవన్నీ చేస్తామని  మాయ మాటలు చెప్పి మా ఓట్లతో అధికారంలోకి వచ్చి మమ్మల్ని మోసం చేసి,, మ్యానిఫెస్టోలో 95 శాతం పూర్తి చేశామని గొప్పలు చెప్పుకుంటూ మీ దగ్గరికి వస్తున్నారు వారిని నిలదీసి అడగండి అని అన్నారు

Related Posts