కోనసీమ
ముఖ్యమంత్రి జగన్ కోనసీమ జిల్లా పర్యటన నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ మహానాడు కన్వీనర్ కుడిపూడి సూర్యనారాయణను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణకు, ఆయనకు మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని పలువురు అంటున్నారు. ఈ మేరకు ఆయన అరెస్ట్‌ను శెట్టిబలిజ సంఘాల నాయకులు ఖండించారు.