నంద్యాల
గతంలో రాష్ట్రంలో కాల్ మని వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరలా వడ్డీ పేరిట సామాన్య మధ్య తరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని కొందరు అప్పులిస్తున్నారు. పట్టణాలతో పాటు పల్లె లకు కూడా తమ వ్యాపారాన్ని విస్తరించి ప్రజల ఆర్థిక అవసరాలను సొమ్ము చేసుకుంటున్నారు. కరోనా కారణంగా రెండేళ్లపాటు పనులు లేక సామాన్య మధ్య తరగతి ప్రజలు ఆర్థికంగా చితికిపోయారు. చెత్త ఆస్తి పన్ను విద్యుత్ ఛార్జీలు పెంపు తరచూ పెరుగుతున్న డీజిల్ పెట్రోల్ ధరలు ప్రభావంతో నిత్యావసర సరుకుల ధరలు చుక్కలనంటుతున్నాయి. ఇంటిల్లిపాది రోజంతా కష్టపడి నా పూట గడవడమే కష్టంగా మారింది. కుటుంబ పోషణ పిల్లల చదువులు వైద్య ఖర్చులు ఇతర అవసరాలకు చేతిలో చిల్లిగవ్వ లేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.
ప్రస్తుతం నంద్యాల పట్టణంలో వారాల వడ్డీ వ్యాపారం జోరుగా సాగుతోందని తెలుస్తోంది . ఖాళీ ప్రాంసరీ నోటు రూ 20 వేల వరకు. ఆపై అయితే ఖాళీ ప్రాంసరీ నోటు చెక్కులు తీసుకుంటున్నారని తెలుస్తోంది . 5000, వేలకు 2000 వడ్డీ. పది వేలకు నాలుగు వేల వడ్డీ. చొప్పున అప్పు ఇస్తున్నారు. ఎంత మొత్తం తీసుకున్న అసలు వడ్డీ కలిపి భాగించగా వచ్చిన మొత్తాన్ని 28 వారాలుగా చెల్లించాలని షరతులు విధిస్తున్నారు. ఉదాహరణకు 5000 రూ. తీసుకుంటే వడ్డీ 2000 మొత్తం 7000 రూ. వారానికి 250 రూపాయల చొప్పున 28 వారాల పాటు వాయిదా పద్ధతిలో చెల్లించాలి. ఒకవేళ మధ్యలో కొన్ని వారాలు చెల్లించకపోతే అదనంగా వడ్డీ వేస్తున్నారు. సామాన్యుల నడ్డి విరుస్తున్న ఈ వ్యాపారం బాహాటంగా సాగుతున్న అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తమకు బాధితులు ఎవరైనా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.