కడప
ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలకంగా వ్యవహరిస్తున్న సివిల్ సప్లై ఆస్తులను తనఖా పెట్టి నిర్వీర్యం చేయవద్దని, హమాలీలకు ఉపాధి భద్రత కల్పించాలని ఏఐటియుసి జిల్లా జనరల్ సెక్రెటరీ ఎల్.నాగసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.సోమవారం స్థానిక మార్కెట్ యార్డ్ లోని సివిల్ సప్లై గోడౌన్ యందు హమాలీల కూలి రేట్లు పెంచాలని రాష్ట్రవ్యాప్తంగా సివిల్ సప్లయిస్ హమాలి వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ పిలుపులో బాగంగా పని బంద్ చేసి నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి,సివిల్ సప్లై హమాలి వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు యల్.నాగ సుబ్బారెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని 19 మండల స్టాక్ పాయింట్స్ యందు లోడింగ్, అన్ లోడింగ్ నిలుపుదల చేసి నిరసన కార్యక్రమాలు నిర్వహించారన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు, డీజిల్, పెట్రోల్ ,గ్యాస్ ధరలు రోజువారీ పెరుగుతూనే ఉన్న హమాలీ కూలి రేట్లు రెండు సం గడచిన పెంచకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.నడుచుకుంటున్న కార్మికులకు న్యాయంగా రావాల్సిన పీఎఫ్ స్లిపులు,ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ ఇవ్వాల్సి ఉండగా హమాలీల పోట్టకోట్టడం తగదన్నారు.ప్రజా పంపిణీ వ్యవస్థలో నగదు బదిలీ పథకాన్ని తీసుకొచ్చి ఆహార భద్రత చట్టాన్ని తూట్లు పోడచకుండా,ఇటు హమాలీల భద్రతకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు.
సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులు యూనియన్ నాయకులతో చర్చించి న్యాయం చేయాలని కోరారు.ఈ కార్యక్ర మంలో ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ కె సి బాదుల్లా,నగర కార్యదర్శి ఉద్దే. మద్దిలేటి,సివిల్ సప్లయిస్ హమాలి వర్కర్స్ యూనియన్ కార్యదర్శి మురారి ,కోశాధికారి రమణ నాయకులు శ్రీకాంత్, నాగయ్య, ప్రతాప్ ,రాజశేఖర్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.