కడప
రైతు చల్లగా ఉంటేనే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని నమ్మిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాతి అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా అన్నారు. సోమవారం ఏలూరు జిల్లా గణపవరం మండలం లో బహిరంగ సభ నుండి "వైఎస్ఆర్ రైతు భరోసా-పిఎం కిసాన్ యోజన" 4వ ఏడాది మొదటి విడత ఆర్ధిక సాయం మొత్తాన్ని కంప్యూటర్ బటన్ నొక్కి.. రైతుల ఖాతాలకు నేరుగా బదిలీ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్ర మానికి జిల్లా నుండి.. కమలాపురం నియోజకవర్గ కేంద్రంలోని.. ఎంపిడివో కార్యాలయ ప్రాంగణం నుండి.. జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు తో పాటు.. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిలు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన అనంతరం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా జిల్లా కలెక్టర్ విజయ్ రామరాజు, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి లతో కలిసి.. జిల్లాలో "రైతు భరోసా- పిఎం కిసాన్ యోజన" పథకం క్రింద వరుసగా 4వ ఏడాది మొదటి విడతగా.. 1,98,074 మంది రైతులకు మంజూరయిన రూ.108,95,01,000 లు మొత్తాన్ని మెగా చెక్కు రూపంలో రైతులకు అందజేశారు. అనంతరం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా మాట్లాడుతూ.. రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని భావించి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 4వ ఏడాది మొదటి విడత "వైఎస్సార్ రైతు భరోసా" సాయాన్ని అందించడం ద్వారా.. వ్యవసా యంపై రైతుల్లో మరింత మక్కువ పెరిగిందన్నారు. గ్రామ సీమలో రైతులు సాగుబడిని పండుగ వాతావరణంలో చేపడుతు న్నారన్నారు. వాస్తవ సాగుదా ర్లందరికీ సాయం అందాలన్నది సర్కారు లక్ష్యం కాగా.. ఈ ఖరీఫ్ సీజన్ కు లబ్ధిదారుల సంఖ్య కూడా పెరిగిందన్నారు. ఈ ఏడాది.. ప్రకృతి కరుణించి అనుకున్న సమయానికంటే ముందుగానే రుతుపవనాలు కూడా రానున్నాయని.. ఆ దిశగా ఖరీఫ్ సాగుకు ప్రభుత్వం రైతులను సమాయత్తం చేస్తోందన్నారు. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నాకుడా.. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం.. రైతు భరోసా సాయాన్ని అందించా రన్నారు. ప్రస్తుతం నిరాటంకంగా నాలుగవ ఏడాది కూడా... రైతు భరోసా సాయం అందివ్వడం సంతోషించదగ్గ విషయం అన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు మాట్లాడుతూ రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిన రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ ఆరంబానికి ముందే రైతులకు సాగుబడి ఖర్చుల కోసం ఆర్థిక సాయం అందివ్వడం హర్శించదగ్గ విషయం అన్నారు. ఖరీఫ్ సీజన్ కోసం రైతులను సన్నద్ధం చేస్తున్న రాష్ట్ర ముఖ్య మంత్రి అన్ని జిల్లాల కలెక్టర్లను, ఇరిగేషన్ అధికారులతో కూడా సమీక్షిస్తూ ఒక నెల ముందే.. ప్రాజెక్టుల నుండి సాగునీటి వసతిని రైతులకు కల్పించాలని.. అదేశించడం జరిగిందన్నారు. అర్హత ఉండీ "వైఎస్ఆర్ రైతు భరోసా" పథకం లబ్ది ఇంకను పొందని వారుంటే.. సంబందిత వార్డు లేదా గ్రామ వాలంటీర్లను, సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్ ను, మండల వ్యవసాయ అధికారిని గానీ సంప్రదించాలన్నారు. ఆర్బికెల్లో.. నిరంతరం రైతులకు సలహాలు సూచనలు అందేలా.. కాల్ సెంటర్లు పనిచేస్తున్నాయన్నారు. ఇంకా.. ఏవైనా సమస్యలు ఉంటే ప్రభుత్వ టోల్ ఫ్రీ నెంబర్ : 155214 కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు.
ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం దండగ అన్న గత ప్రభుత్వ తీరును మార్చేసి... వ్యవసాయాన్ని పండుగలా మార్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది నుంచే "రైతు భరోసా" సాయం పథకాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకోచ్చారంటే.. వైఎస్ జగన్మో హన్ రెడ్డికి రైతులపై ఉన్న అభిమానం, శ్రద్ధ ఎంతటిదో అర్థమవుతోందన్నారు. ప్రతి ఏడాది రూ.13,500ల చొప్పున ఐదేళ్లలో రూ.67,500లను అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి అందిస్తోం దన్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్‌కు గాను భూ యజమానులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులకు, దేవాదాయ, అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా రైతు భరోసా ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించడం మహా అద్భుతం అన్నారు.
ఈ కార్యక్రమంలో చింతకొమ్మదిన్నె జడ్ పి టిసీ సభ్యులు నరేన్ రామాంజల రెడ్డి జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పి.శివప్ర సాద్ రెడ్డిలు, కడప నగర డిప్యూటీ.మేయర్ నిత్యానంద రెడ్డి, జిల్లా రైతు సలహా మండలి చైర్మన్.పి.శివప్రసాద్ రెడ్డి, రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ కరీముల్లా, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్తేర్ రాణి, ఎపి మైన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ వీరప్రతాప్ రెడ్డి, కమలాపురం మార్కెట్ యార్డు చైర్మన్ ఉత్తమరెడ్డి, కడప ఆర్డీవో ధర్మచంద్రారెడ్డి, కమలాపురం తహసీల్దార్ అమరేశ్వరి, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి నాగేశ్వర రావు, ఉద్యానశాఖ డిడి వజ్రశ్రీ, ఏపీఎంఐపీ పీడి మధుసూధన రెడ్డి, డి.ఆర్.సి. ఏడీఏ నాగరాజు, మండల అధ్యక్షురాలు భారతి, ఎంపీపీవో శ్రీదేవి, స్థానిక వ్యవసాయశాఖ ఎడి అనుబంధ శాఖల అధికారులు, లబ్దిదారులయిన రైతులు తదితరులు పాల్గొన్నారు.