YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కడప గడపలో "గడప గడపకు" మన ప్రభుత్వం

కడప గడపలో "గడప గడపకు" మన ప్రభుత్వం

కడప
తిరుమల తొలి గడపదేవునికడపలోశ్రీలక్షివెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి"గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమాన్ని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా ప్రారంభించారు. వీధుల్లో పూల తోమహిళలు  స్వాగతం పలికారు.  ఉప ముఖ్యమంత్రికి రక్షా బంధన్ కంకణాలను కట్టి అభిమానం, ఆప్యాయత , అనురాగలను  వ్యక్తం చేశారు. ఇందులో  మొదటి రోజు  85 గడపలు తిరిగి ప్రజల సమస్యలను అంజాద్ బాషా అడిగి తెలుసు కున్నారుగతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ పథకా లను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్నారని వివరించారు.  మూడేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలలో 95శాతం అమలు చేసిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా  ఏదో ఒక పథకం ద్వారా ప్రతి గడపకు రూ.50 వేల నుంచి రూ.2.50 లక్షల వరకు లబ్ది చేకూరిందన్నారు లబ్దిదారులు ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేశారు.
ప్రతి ఇంటికి వెళ్ళి  ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలు తెలియజేస్తామన్నారు సమస్యలు తెలుసుకుని  వాటిని పరిష్కరిస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల లబ్దిని అందిస్తామన్నారు.  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను తిరిగి ఆశీర్వ దించాలని డిప్యూటీ సీఎం ఎస్ బి అంజాద్ భాషా ప్రజలను కోరారు  సచివాలయ సిబ్బంది ద్వారా  మా వీధుల్లో సమస్యలు వెంటనే పరిష్కారం అవుతున్నాయని . ప్రభుత్వం అందించే పథకాల గురించి వాలంటీర్లు చక్కగా వివరించి  లబ్ది చేకూరుస్తున్నారు. అంటూ  సంతోషాన్ని స్థానిక ప్రజలు  వ్యక్తంచేశారు. ఈకార్యక్రమంలోడిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, స్థానిక డివిజన్ కార్పొరేటర్ సుబ్బారెడ్డి, మున్సిపల్ కమిష నర్ రమణారెడ్డి, తహశీల్దార్ శివరామిరెడ్డి, సచివాలయ సిబ్బంది, స్థానిక వైసిపి నేతలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts