YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నాలుగేళ్లల్లో 4700 మంది రైతుల ఆత్మహత్య : టీటీడీపీ ఛీఫ్ రమణ

నాలుగేళ్లల్లో 4700 మంది రైతుల ఆత్మహత్య : టీటీడీపీ ఛీఫ్ రమణ

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ టి డి పి కార్యాలయాన్ని సందర్శించిన తెలంగాణ తెలుగు దేశం పార్టి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ శుక్రవారం నాడు సందర్శించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన కె సి ఆర్ ప్రభుత్వం హామీలను అమలు చేయాకుండ ఎన్నికల ప్రణాలికను విస్మరించిందని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్  తనకు తాను రాత్రి సమయంలో పథకాలను ఊహించుకొని తెల్లారేసరికి పథకాలను అమలు చేస్తున్నారు. దీని వల్ల పెద్దలకు తప్ప పేదలకు ఉపయోగం లేదని అయన అన్నారు. దేశంలోని 28 రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు సచివాలయం నుండి పాలిస్తే కేసీఆర్ మాత్రం నయా రాజభవనాన్ని నిర్మించుకొని విలాస వంతంగా ఏలుతున్నారని విమర్శించారు. నాలుగేండ్ల టి ఆర్ ఎస్ పాలన లో 5 లక్షల కోట్ల ఖర్చు చేస్తే అభివృద్ధి ఎక్కడ ఉన్నది నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని అయన ప్రశ్నించారు. నాలుగేండ్ల పాలనలో తెలంగాణలో 4700 మంది రైతులు ఆత్మ హత్య చెసుకున్నారు. మొదటి ఆరు నెలలలోనే 600 మంది రైతులు ఆత్మ హత్యలు చేసుకున్నారని రమణ అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర,  బోనస్ ఏవి ఇవ్వకుండ రైతు బంధు పేరుతో మసిపూసి మారేడు కాయ చేస్తున్నారని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో తెలంగాణ లో రామన్న రాజ్యం వస్తే పేదలకు న్యాయం జరుగుతుందని అయన అన్నారు.

Related Posts