- కేసీఆర్ పాలన ఎక్కడ స్మార్ట్‌గా ఉందో చెప్పాలి
- ఇది ఇత్తడి తెలంగాణ..
- పవన్‌కు విజయశాంతి కౌంటర్
- తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్లే ప్రసక్తే లేదు
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ తెలంగాణలో చేపట్టిన రాజకీయ యాత్రపై నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి స్పందించారు. పవన్ రెండు కళ్ల సిద్ధాంతం ఇక్కడ పనిచేయదంటూ కౌంటర్ ఇచ్చారు. గురువారం ఇక్కడ మీడియాతో చిట్ చాట్ సందర్భంగా పలు విషయాలను ఆమె ప్రస్తావించారు. రాష్ట్ర ప్రజల్లో టీఆర్ఎస్ పాలనపై తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. సీఎం కేసీఆర్ పాలన ఎక్కడ స్మార్ట్‌గా ఉందో చెప్పాలని పవన్ కల్యాణ్‌ను విజయశాంతి ప్రశ్నించారు.
పవన్ రెండు కళ్ల సిద్ధాంతం తెలంగాణలో పని చేయదంటూ ఆయన తీరును విమర్శించారు. తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గతేడాది అన్నాడీఎంకే నాయకురాలు వీకే శశికళను విజయశాంతి కలుసుకున్న నేపథ్యంలో ఆమె ఏఐఏడీఎంకే పార్టీలో చేరనున్నారని, తమిళ రాజకీయాల్లోకి ఈ ‘లేడీ సూపర్ స్టార్’ ఎంట్రీ ఖాయమంటూ వదంతులు ప్రచారమైన సంగతి తెలిసిందే. త్వరలో పార్టీలో క్రియా శీలకంగా పనిచేస్తానని చెప్పిన విజయశాంతి.. కాంగ్రెస్ అధిష్టానం ఏం చెప్పినా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
అతి త్వరలో క్రియాశీలకంగా ..విజయశాంతి
కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పాల్గొంటాను.కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కొంత గ్యాప్ తీసుకున్నాను.అధిష్టానంతో రేగులర్గా టచ్ లో ఉన్నాను.రానున్న ఎన్నికల్లో పోటీ చేయను అని అధిష్టానంతో చెప్పాను.పూర్తి పార్టీ బాధ్యతలు తీసుకోవలనుకుంటున్నాను అని రాహుల్ తో చెప్పాను. లేదు మీరు ఖచ్చితంగా పోటీ చేయాలని రాహుల్ గాంధీ కోరుతున్నారు. రాములమ్మగా ప్రజలకు సేవ చేయడానికి ఎప్పుడూ సిద్దం.ఇక నుంచి ఆక్టీవ్ పాలిటిక్స్ లో విజయశాంతిని చూస్తారు. నాకున్న సమాచారం ప్రకారం తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరు. మీడియకున్న ఫ్రీడమ్ కూడా ఈ ప్రభుత్వంలో లేదు.ప్రజల సమస్యల ను చూపించకుండా మీడియా గొంతు కూడా ఈ ప్రభుత్వం నొక్కుతుంది.20 ఏళ్ల నుండి తెలంగాణ కోసం పోరాడుతున్నాను,ఇక ముందూ పోరాడుతాను.కోదండరాం కు ప్రజలలో తిరిగే హక్కు ఉంది.అధికార పార్టీకి వ్యతిరేకంగా ఒక వేళ ప్రజలు గళం విప్పితే ప్రజలను కూడా జైల్లో పెడుతుందా ఈ ప్రభుత్వం.అవసరం కోసం పవన్ కొత్త రాజకీయాలు చేస్తుండొచ్చు.తెలంగాణ ప్రజలు తెలివైన వాళ్ళు పవన్ మాటలకు ఏమీ పడరు.తెలంగాణ ఉద్యమంలో సమైక్యాంధ్ర కు సపోర్ట్ చేసిన వాళ్లను మంత్రులుగా తీసుకునే ముందు ఈ ప్రభుత్వం ఆలోచించాల్సింది.తెలంగాణ విడిపోయిన తరువాత ఈ రాష్ట్రంలో నిర్బంధాలు ఎక్కువయ్యాయి.ఈ ప్రభత్వం ఓవర్ కాన్ఫిడెన్స్ తో వెళ్తుంది,కళ్ళు నేల మీద ఉంటే మంచిది.ఇది బంగారు తెలంగాణగా కనబడటం లేదు ,ఇత్తడి తెలంగాణగా కనపడుతుంది.ఉద్యమం లోని కేసీఆర్ వేరు, ఇప్పుడు అధికారం లోకి వచ్చాక మారిన కేసీఆర్ ను ఇప్పుడు చూస్తున్నాం.పార్టీ కోసం విస్తృత ప్రచారం చేసి అధికారం కోసం పాటుపడాలని,అందుకే పోటీ చేయొద్దనుకున్నాను.కానీ అధిష్టానం పోటీ చేయమంటుంది నన్ను.రాజకీయాలలో అన్నీ చూసాను, ఒడిదుడుకులు,వెన్నుపోట్లు, అవమానాలు,అన్నీ ఫేస్ చేసాను.ఇద్దరు వేరు వేరుగా తెలంగాణ కోసం పోరాడటం దేనికి,కలిసి పోరాడండి అని జయశంకర్ పిలుపు మేరకు నా పార్టీని టీఆరెస్ లో విలీనం చేసాను.కానీ నన్ను టీఆరెస్ పార్టీ నుండి అర్ధరాత్రి సస్పెండ్ చేశారు.ప్రజలు గమనిస్తున్నారు.తమిళనాడులో జయలలిత అంటే అభిమానం,అందుకే ఏఐడీఎంకేకి సపోర్ట్ చేసాను. డీఎంకే పార్టీ నన్ను చంపాలని చూసింది.నా తక్షణ లక్యం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవలనే.అడ్వాణీకి బీజేపీలో అన్యాయం జరిగింది,మేమందరం అద్వానీ శిష్యులం,కనీసం ప్రెసిడెంట్ ని చేసేదుండే.రామారావు అమాయకుడు,అలా టీఆరెస్ పార్టీలో జరగదు.అన్నను చూసాం అన్నకు దిక్కులేదు,ఇప్పుడు తమ్ముడి పవన్ ని చూస్తున్నాం .రెండుపడవల ప్రయాణం పనికిరాదు,ఒకవైపు దృష్టి పెడితే బాగుంటుంది.పవన్ ని ఉద్దేశించి.రానున్న రోజుల్లో రాహుల్ గాంధి ఆధ్వర్యంలో యువతకు అవకాశాలు ఈ సారీ ఎక్కువగా ఉంటాయని ఆశిస్తున్నాను.నన్ను పార్టీనుండి ఎందుకు సస్పెండ్ చేసారో ఇప్పటికీ తెలియదు.రాహుల్ గాంధీ ఎలాంటి బాధ్యతలు అప్పగించిన చేయడానికి సిద్దమని విజయశాంతి స్పష్టం చేశారు.