YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సింహపురిలో బంగారం, రాగి నిక్షేపాల అన్వేషణ

సింహపురిలో బంగారం, రాగి నిక్షేపాల అన్వేషణ

నెల్లూరు, మే 18,
నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి కొండల్లో బంగారం, రాగి నిక్షేపాల అన్వేషణ కోసం కేంద్రం మరో ముందడుగు వేసింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని మాసాయిపేట కొండపై బంగారు, రాగి, వైట్‌ క్వార్ట్‌ ఖనిజ నిక్షేపాల ఆనవాళ్లు కనిపించడంతో.. కేంద్రం ఆధ్వర్యంలో అన్వేషణ ప్రారంభమైంది. ఈ మేరకు కొండపై నిక్షేపాలగుర్తింపు కోసం ముమ్మరంగా డ్రిల్లింగ్‌ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మ్యాపింగ్‌ నిర్వహించి కొండలో ఎంత మేర ఖనిజ నిక్షేపాలు ఉన్నాయో తెలుసుకునేందుకు కొంత కాలంగా డ్రిల్లింగ్‌ పనులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా.. కొండపై ఐదు ప్రాంతాల్లో 500 నుంచి 1000 అడుగుల మేర డ్రిల్లింగ్‌ నిర్వహించి.. 46 నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించింది.ఉదయగిరి మండలం ఉదయగిరి, మాసాయిపేట పరిసర ప్రాంతాలలో సుమారు రెండు వేల హెక్టార్లకు పైగా భూముల్లో బంగారు, రాగి, వైట్‌క్వార్ట్జ్ నిక్షేపాలున్నట్లు గుర్తించింది. హైదరాబాద్‌ నుంచి అధికారుల బృందంతో జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా వాహనంతో డ్రిల్లింగ్‌ చేసే ప్రాంతానికి చేరుకొని తాజాగా పరిశీలించారు. 150 మీటర్ల మేర డ్రిల్లింగ్‌ వేసిన ప్రాంతంలో భూగర్భంలోకి సీసీ కెమెరాలు పంపి నిశితంగా వివరాలు సేకరిస్తున్నారు. దీంతోపాటు నమూనాలు సేకరించి ల్యాబ్‌కు తరలిసిస్తున్నారు. కాగా.. ఖనిజ నిక్షేపాలతోనైనా ఉదయగిరి మెట్ట ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఈ ప్రాంత వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.సుమారు రెండు వేల హెక్టార్లకు పైగా భూముల్లో బంగారు, రాగి, వైట్‌క్వార్‌ట్ట్జ నిక్షేపాలున్నట్లు గుర్తించింది. సోమవారం హైదరాబాద్‌ నుంచి అధికారుల బృందంతో జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా వాహనంతో డ్రిల్లింగ్‌ చేసే ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు. 150 మీటర్ల మేర డ్రిల్లింగ్‌ వేసిన ప్రాంతంలో భూగర్భంలోకి సీసీ కెమెరాలు పంపి సేకరిస్తున్నారు. ఖనిజ నిక్షేపాలతోనైనా ఉదయగిరి మెట్ట ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఈ ప్రాంత వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts