YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బీసీ ఓట్లు..వయా కృష్ణయ్య

బీసీ ఓట్లు..వయా కృష్ణయ్య

విజయవాడ, మే 18,
వచ్చే ఎన్నికల్లో బీసీల ఓట్లను కొల్లగొట్టేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో ఎత్తుగడ వేశారు. జాతీయ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను ఏపీ తరఫున రాజ్యసభకు పంపిస్తున్నారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీసుబ్బారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణలతో చర్చించి, అభ్యర్థుల జాబితాను ఖరారు చేశారు. ఈ నెలాఖరులో ఖాళీ అయ్యే నాలుగు స్థానాలకు విజయసాయిరెడ్డి, బీద మస్తాన్ రావు, నిరంజన్ రెడ్డి, ఆర్. కృష్ణయ్యపేర్లను ఖరారు చేసినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారుఅయితే.. ఆర్.కృష్ణయ్య జగమెరిగిన బీసీ నేత. బీసీల సంక్షేమం కోసం జాతీయ స్థాయిలో కూడా అనేక ఉద్యమాలు చేశారు. అలాంటి బీసీ పెద్ద ఆర్.కృష్ణయ్యను వైసీపీ అధినేత నేరుగా రాజ్యసభకు పంపాలనే నిర్ణయం తీసుకోవడం వెనుక జగన్ రెడ్డి రాజకీయ ఎత్తుగడ ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అయితే.. తెలంగాణకు చెందిన కృష్ణయ్యను పనిగట్టుకుని ఏపీ తరఫున ఊహించని విధంనం అందలం ఎక్కించాలనుకోవడంతో పలువురిలో ఆశ్చర్యం కలుగుతోంది. తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు ఆఫీసులో జగన్ తో మంగళవారంనాడు ఆర్. కృష్ణయ్య భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే ఏపీ నుంచి రాజ్యసభకు పంపించేవారి జాబితాను జగన్ ఫైనల్ చేశారంటున్నారు.ఏపీ నుంచి రాజ్యసభకు ఏర్పడే నాలుగు ఖాళీలకు సంబంధించిన షెడ్యూల్ కూడా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ముందుగా వచ్చిన వార్తల ప్రకారం ఏపీ నుంచి రాజ్యసభకు విజయసాయిరెడ్డిని కొనసాగించడంతో పాటు నెల్లూరుకు చెందిన పారిశ్రామికవేత్త, మాజీ టీడీపీ నేత బీద మస్తాన్ రావును కన్ఫం చేశారని అన్నారు. మరో అభ్యర్థిగా ఉత్తరాంధ్రకు చెందిన బీసీ మహిళ, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణికి ఛాన్స్ ఇస్తారనే వార్త  రాజకీయ వర్గాల్లో హల్ చల్ చేసింది. మరో స్థానాన్ని గుజరాత్ కు చెందిన పారిశ్రామికవేత్త అదాని సతీమణికో లేక ఆయనకో కేటాయించారని గతంలో వార్తలు వచ్చాయి. మరో స్థానంలో న్యాయవాది నిరంజన్ రెడ్డి పేర్లు వినిపించాయి. కాగా.. తాజా పరిణామంలో నాలుగోస్థానంలో కిల్లి కృపారాణికి బదులు బీసీ నేత ఆర్.కృష్ణయ్యను రాజ్యసభకు పంపిస్తుండడం విశేషం.బీసీ ఓట్ల కోసం జగన్ గాలం వేయడమే కాకుండా ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఉంది. ఇంతకు ముందు ఆర్.కృష్ణయ్య కూడా తెలుగుదేశం పార్టీ నుంచి తెలంగాణలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీద మస్తాన్ రావు కూడా టీడీపీ మాజీ నేతే కావడం గమనార్హం. మస్తాన్ రావుతో పాటు ఆర్. కృష్ణయ్యను పెద్దల సభకు పంపించాలనే జగన్ నిర్ణయం వెనుక టీడీపీని దెబ్బతీయాలనే కుటిల యత్నం ఉందని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వస్తున్నాయి.బీసీ సమస్యలపై ఆర్.కృష్ణయ్య ఎన్నో ఉద్యమాలు నిర్వహించారు. అప్పటి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి కృష్ణయ్య ఎంతో చేరువగా ఉండేవారు. వైఎస్సార్ దృష్టికి తీసుకెళ్లి ఎన్నో సమస్యలు పరిష్కారం అయ్యేలా చేశారు. అయితే.. రాష్ట్ర విభజన తర్వాత ఆర్.కృష్ణయ్య తెలంగాణకే పరిమితం అయ్యారు. అలాంటి ఆర్.కృష్ణయ్యను ఏపీ నుంచి రాజ్యసభ పంపడం ద్వారా బీసీ ట్రంప్ కార్డును తెరమీదకు తీసుకురావాలనే ఎత్తుగడ వైఎస్ జగన్ వేశారంటున్నారు. ఆర్.కృష్ణయ్యను ఎంపిక చేయడం జగన్ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయమే అంటున్నారు.

Related Posts