YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఢమాల్ మంటున్న రూపాయి

ఢమాల్ మంటున్న రూపాయి

ముంబై, మే 18,
భారత కరెన్సీ రూపాయి విలువ పతనం గత కొన్ని రోజులుగా కొనసాగుతూనే ఉంది. ఈ రోజు కూడా ఇంట్రాడేలో కనిష్ఠమైన 77.69ని తాకింది. చైనా ఎకానమీకి పరిస్థితులకు సంబంధించిన డేటాతో పాటు అంతర్జాతీయంగా మాంద్యం పరిస్థితులు ఈ పతనానికి కారణంగా తెలుస్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత మదుపరులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవటం కూడా రూపాయి విలువ కోల్పోవటానికి కారణంగా నిలుస్తోంది. శుక్రవారం మార్కెట్ సెషన్ లో రూపాయి విలువ కొంత మేర పుంజుకుని 77.31కి చేరుకుంది. ఆ రోజు అమ్మకాలను కట్టడి చేసేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు రంగంలోకి దిగింది. డాలర్ తో రూపాయి మారకపు విలువ 77 స్థాయిని దాటడం మార్చిలో తొలిసారిగా దాటింది. అధిక ఆయిల్ ధరలు కూడా డాలర్ మారక విలువపై ప్రభావం చూపుతున్నాయి.ఈ క్రమంలో యూఎస్ డాలర్ రెండు దశాబ్దాల గరిష్ఠ స్థాయి నుంచి ఎడ్జ్ అయ్యింది. ఆరు కరెన్సీల బాస్కెట్‌తో US డాలర్ బలాన్ని అంచనా వేసే డాలర్ ఇండెక్స్ 0.01% తగ్గి 104.19 వద్ద ట్రేడ్ అవుతోంది. రానున్న కాలంలో రూపాయి మారకపు విలువ సుమారు రూ.80 వరకు పడివోవచ్చని తెలుస్తోంది. అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచటం వల్ల కూడా డాలర్ పై ప్రభావం పడుతోంది. డాలర్ తో రూపాయి విలువ పతనం ఇలాగే కొనసాగితే దిగుమతులు మరింతగా భారం కానున్నాయి. దీని వల్ల క్రూడ్ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. అసలు రూపాయి విలువ పతనం వల్ల ఐటీ, ఎగుమతులు చేసే కంపెనీలకు ఎక్కువ లాభం చేకూరనుంది. ఇదే సమయంలో విదేశీ ప్రయాణికులు ఎక్కువగా లాభపడనున్నారు. ఇవి కాక రెమిటెన్సస్ వ్యాపాలంలో ఉండే వారికి రూపాయి పతనం మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టనుంది.

Related Posts