నెల్లూరు
ముత్తుకూరు మండలం పొట్టెంపాడులో నిర్వహించిన బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గోన్నారు. సోమిరెడ్డి మాట్లాడుతూ మూడేళ్లుగా ఓ వైపు రైతులపై, మరో వైపు ప్రజలపై వైసీపీ ప్రభుత్వం రోజుకు ఒక రూపంలో దాడులు చేస్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ వ్యవస్థను సమూలంగా ఆధునీకరించినప్పటికీ రైతుల వద్ద నీటి తీరువా వసూలు చేయలేదు. ఇప్పుడు జగనన్న వచ్చి కాలువల్లో తట్ట మట్టి తీయకపోగా ఏడేళ్లకు సంబంధించి వడ్డీతో సహా నీటి తీరువా కట్టి కట్టాల్సిందేనని రైతులపై వత్తిడి తేవడం దుర్మార్గం. యూనిట్ రూ.6.85గా ఆక్వా విద్యుత్ చార్జీలను టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు రూ.2కి తగ్గించారు. ఆ రూ.2ని రూ.1.50కి తగ్గించామని చెబుతున్న జగన్ రెడ్డి జోన్లు, నాన్ జోన్ల పేరుతో ఆక్వా రైతులను బాదేస్తున్నారని అన్నారు.
జోన్ లో ఉంటేనే రూ.1.50 అంట ఐదెకరాలు దాటితే రూ.3.85 అంట..నాన్ ఆక్వాజోన్ లో రూ.4 అంట. ఒక రోజు కరెంట్ చార్జీలు పెంపు, మరో రోజు విద్యుత్ చార్జీలు, ఓ వైపు ఇంటి పన్నులు, ఇంకో వైపు చెత్త పన్ను...ఇలా రోజుకో పన్ను అంటూ ప్రజల నడ్డి విరగ్గొట్టేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయానికి 9 గంటల పాటు ఇచ్చిన విద్యుత్ ను 7 గంటలకు కుదించడమే గాక ఇప్పుడు అదనంగా మీటర్లు బిగిస్తారంట. మీటర్లు పెడితే 30 శాతం విద్యుత్ మిగులుతుందని మంత్రులు ప్రకటిస్తున్నారు...అప్పుడు ఆ 30 శాతం విద్యుత్ ను రైతులు దొంగతనం చేస్తున్నారని చెబుతున్నారా. ఈ రోజు మీటర్లు పెడతామంటారు...రేపు ఆక్వా రైతులను మోసం చేసినట్టే మోసం చేసి యూనిట్ పావలానో, అర్థరూపాయో వసూలు చేసే కుట్రలో జగన్ రెడ్డి ప్రభుత్వం ఉంది. అందుకే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెడితే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం..ఈ విషయంలో తాడోపేడో తేల్చుకుంటామని అన్నారు. మా ప్రభుత్వంలో పుట్టికి 850 కిలోల వంతున కొనుగోలు చేసి రైతులకు వారం రోజుల్లో నగదు చెల్లించామని అన్నారు.
మీ ప్రభుత్వంలో 200 నుంచి 300 కిలోలు అదనంగా తీసుకుంటూ రైతుల పుట్టి ముంచడంతో పాటు నగదు కూడా ఆరేడు నెలలకూ చెల్లించని పరిస్థితి. ఏదో ఉద్దరిస్తాడని ప్రజలు 151 సీట్లు ఇస్తే ప్రభుత్వాన్ని కార్పొరేట్ కంపెనీగా మార్చి వ్యాపారం చేసుకుంటున్నారు. నిన్న పత్రికల్లో భారీ ప్రకటనలు ఇచ్చారు. మూడేళ్లలో రైతుల కోసం 1.10 లక్షల కోట్లు ఖర్చు పెట్టారంట..43 వేల కోట్లకు పైగా మొత్తాన్ని ధాన్యాన్ని కొనుగోలు చేయడానికే ఖర్చుపెట్టారంట..ఇది మరీ విడ్డూరంగా ఉంది. రైతుల వద్ద ధాన్యం కొని ఏట్లో పోశారా...కాదు మిల్లింగ్ చేసి ఎఫ్.సి.ఐకి అమ్మారు..ఆ డబ్బులకు రైతులకు ఇచ్చారు..ఇక్కడ నువ్వు రైతులకు ఖర్చుపెట్టిందేంటో. చివరకు అగ్రికల్చర్ మార్కెటింగ్ సెస్ భారాన్ని రైతులపై మోసి ఆ ఆదాయం చూపి అప్పులు తెచ్చుకునే పరిస్థితికి వచ్చారు. జగన్ రెడ్డి రాజ్యంలో వ్యవస్థలు సర్వనాశనం అయిపోయాయి...ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు డమ్మీలుగా మారిపోవడం చూస్తే చాలా బాధేస్తోందని అన్నారు.