అహ్మాదాబాద్ మే 18
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి భారీ జలక్ తగిలింది. హార్దిక్ పటేల్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. గుజరాత్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట కారణంగా ఆయన ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్న విషయాన్ని ఆయన తన ట్విట్టర్ అకౌంట్‌లో వెల్లడించారు. గుజరాతీ ప్రజలు తన నిర్ణయాన్ని స్వాగతిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. తాను వేయబోయే అడుగు భవిష్యత్తులో గుజరాతీలకు పాజిటివ్‌గా పనిచేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశౄరు.రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. పట్టేదార్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన హార్దిక్ పటేల్ 2019లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గుజరాత్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు అధికంగా ఉన్నట్లు చాన్నాళ్ల నుంచి హార్దిక్ ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు.