విశాఖపట్నం
సమాజంలోని ఆడవారిని గౌరవించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పై ఉందని విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికా ర్జున్ తెలిపారు.దిశా యాప్ ద్వారా మహిళలకు ఒక ధైర్యం కల్పించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. విశాఖ నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ ఆధ్వర్యం లో మహిళా భద్రత కోసం ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ రూపొందించిన దిశ యాప్ రిజిస్ట్రేషన్ మెగా డ్రైవ్ కార్యక్ర మం సిరిపురం వద్ద వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఏరినాలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ జిల్లాలోని మహిళా ప్రజాప్రతి నిధులు మేయర్ హరి వెంకట కుమారి, జడ్పీ చైర్పర్సన్ సుభద్ర, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, వీఎంఆర్డీఏ చైర్మన్ విజయ నిర్మల, జిల్లా కలెక్టర్ మల్లికార్జున పాల్గొన్నారు.ఈ సందర్భం గా జిల్లా కలెక్టర్ మల్లికార్జున మాట్లా డుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అన్నిటిలో సగభాగం రిజర్వేషన్ కల్పించి గౌరవ స్థానంలో ఉంచిందని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల చిన్న పిల్లలపై జరుగుతున్న అకృత్యాలు క్షమించరా ని నేరమని, అటువంటి జరక్కుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. చట్టాలు కూడా చాలా బలంగా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుత చట్టాల ద్వారా తక్కువ సమయంలో నే చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందని గుర్తు చేశారు. నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ యాప్ లో ఇప్పటివరకు 5 లక్షల 25 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందన్నారు. ఈ ఒక్కరోజే మెగా డ్రైవ్ ద్వారా మహిళల మొబైల్ ఫోన్లలో దిశ యాప్ ను పెద్ద ఎత్తున డౌన్లోడ్ చేయిస్తున్నట్లు తెలిపారు. దిశ యాప్ ద్వారా నేరం జరగకుండా మహిళలకు ఎంతో రక్షణ ఇస్తుందని తెలియజేశారు.