కర్ణాటక రాజకీయాలపై సుప్రీం కోర్టు ధర్మాసనం ను దేశం యావత్తూ హర్షిస్తోందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం లోపు బీజేపీ బలం నిరూపించుకోవాలని ఆదేశించడంతో పాటు చేతులెత్తే విధానంలో బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించడం హర్షణీయమని అయన అన్నారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం మెజార్టీ ఎమ్మెల్యేలతో జేడీఎస్, కాంగ్రెస్ పార్టీ రాజ్ భవన్ ఎదుట పరేడ్ చేసినా యడ్యూరప్పకే గవర్నర్ అవకాశం ఇచ్చారు. ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉందని సుప్రీంకోర్టు తీర్పు చెబుతోంది. వందల కోట్ల నగదు, మంత్రి పదవుల ఆఫర్లతో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కర్ణాటక పరిణామాలను దేశం మొత్తం గమనిస్తోంది. ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగకుండా ఆత్మగౌరవంతో బీజేపీ కేంద్ర నాయకత్వానికి గుణపాఠం ప్పాలి..ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అన్నారు. కర్ణాటక ఎమ్మెల్యేలు సంచలనాత్మకంగా నిలబడి తీసుకునే నిర్ణయం మోదీకి చెంపపెట్టు కావాలని అన్నారు.