కర్ణాటకలో బిజెపికి సంఖ్యాబలం లేదు. ప్రభుత్వం ఏర్పాటుచేసే హక్కు లేదు, ప్రజాబలంలో నిజం లేదని మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. అటువంటప్పుడు బిజెపికి ఎందుకు అవకాశం ఇచ్చారు. విచక్షణాధికారంపై అనేక అంతర్జాతీయ తీర్పులు ఉన్నాయని అన్నారు. వాటికి వ్యతిరేకంగా కర్ణాటక గవర్నర్ వ్యవహరించారు. విచక్షణ లేకుండా సొంతంగా అధికారం వినియోగించారు. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేశారని అన్నారు. భారత రాజ్యాంగానికి ద్రోహం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లకు అవకాశం కల్పించారని అన్నారు. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే రాష్ట్రానికో రకంగా వ్యవహరించరాదు. దేశం మొత్తం ఒకే విధానం అనుసరించాలి. ఒకే ప్రజాస్వామ్య సాంప్రదాయం పాటించాలని అన్నారు. గోవా, మేఘాలయ, మణిపూర్ లో ఒక రకంగా వ్యవహరించారు. కర్ణాటకలో మరో రకంగా వ్యవహరించడం సరైన విధానం కాదని అన్నారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మేఘాలయలో కాంగ్రెస్ ను పిలవాలి. పది నెలల క్రితం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీహార్ లో ఆర్జెడిని పిలవాలని అన్నారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గోవాలో కాంగ్రెస్ ను పిలవాలి. అలాంటిది రాష్ట్రానికో రకంగా వ్యవహరించడం తగదని అన్నారు. బలపరీక్షకు సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నాం. వర్నర్ తప్పును కొంతమేర సుప్రీంకోర్టు చక్కదిద్దిందని అన్నారు.