YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

తుక్కుగూడలో రైతు బంధు

 తుక్కుగూడలో రైతు బంధు

రైతుబంధు కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం  తుక్కుగూడ లో జరిగిన పాసుపుస్తకాలు చెక్కుల పంపిణీ  కార్యక్రమంలో రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు  కొండా విశ్వేశ్వరరెడ్డి   మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పాల్గోన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు రైతులు గ్రామస్తుల కుడా పాల్గోన్నారు. ఈ సందర్బంగా వారు రైతులకు కొత్త పాస్ పుస్తకాలు మరియు చెక్కులను అందచేశారు. మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ   రాష్ట్రంలో  అన్నదాతల్లో ఆత్మవిశ్వాసం పెంచింది. రంగారెడ్డి జిల్లాలో రైతుబంధు పథకం లో భాగముగా 25 మండలాలలోని 542 గ్రామాలలో పట్టాదారు పాస్ పుస్తకాలు మరియు చెక్కులను పంపిణి చేయటం జరిగిందని అన్నారు. జిల్లాలో 2.82 లక్షల మంది రైతులకు 283.05 కోట్ల రూపాయల చెక్కులను పంపిణి చేయడము జరిగిందని మంత్రి తెలిపారు. ఎంపీ విశ్వేశ్వరరెడ్డి  మాట్లాడుతూ  రైతు సంక్షేమకోసం టి.ఆర్.ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. ప్రతి పల్లెలో కూడా పండగ వాతావరణం వచ్చింది. 20 శాతం వృద్ధి రేటు తో రాష్ట్రం అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిచిందని అన్నారు. 

Related Posts