YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నిస్వార్ధ ప్రజా నాయకుడు నీలం సంజీవ రెడ్డి

నిస్వార్ధ ప్రజా నాయకుడు నీలం సంజీవ రెడ్డి

విజయవాడ
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణలో నీలం సంజీవరెడ్డిది ప్రముఖపాత్ర అని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ అన్నారు. భారత దేశ ఆరవ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి జయంతిని పురస్కరించుకుని గురువారం విజయవాడ ఆంధ్ర రత్న భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. నీలం సంజీవరెడ్డి  భారత రాష్ట్రపతి గా, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా, లోక్‌సభ సభాపతి గా, ఆంధ్ర రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, సంయుక్త మద్రాసు రాష్ట్రంలో మంత్రిగా, కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడిగా వివిధ పదవులను అలంకరించి, ప్రజల మన్ననలను పొందిన రాజకీయవేత్త అని శైలజనాథ్ కొనియాడారు.1929 లోనే మహాత్మా గాంధీ స్ఫూర్తితో చదువును పక్కనపెట్టి రాజకీయాల్లో చేరి స్వాతంత్య్ర  పోరాటం వైపు దృష్టి సారించి  1937లో ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెసు కమిటీకి కార్యదర్శిగా ఎన్నికై దాదాపు పదేళ్ళపాటు ఆ పదవిలో కొనసాగారని శైలజనాధ్ గుర్తు చేశారు, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళారని చెప్పారు. 1940, 1945 ల మధ్య ఎక్కువకాలం సంజీవరెడ్డి జైలులో ఉన్నారని, 1946లో మద్రాసు శాసనసభకు ఎన్నిక కాగా  1947లో రాజ్యాంగ నిర్మాణ సంఘమైన రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారని వివరించారు.
రాష్ట్ర స్థాపనలో ప్రధాన, నిర్ణాయక ఘట్టమైన పెద్దమనుషుల ఒప్పందంలో ఆంధ్ర తరపున అప్పటి ఆంధ్ర ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డితో పాటు ఉపముఖ్యమంత్రిగా ఉన్న సంజీవరెడ్డి కూడా పాల్గొని ఒప్పందంపై సంతకం పెట్టారని, ఆంధ్ర ప్రదేశ్ అవతరించాక, కాంగ్రెసు శాసనసభాపక్ష నాయకుడిగా మరియు తొలి ముఖ్యమంత్రి అయ్యారన్నారు.   1960లో అఖిల భారత కాంగ్రెసు అధ్యక్షపదవికి ఎన్నికవడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రెండేళ్ళు పనిచేసి మళ్ళీ 1962లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు. రవాణా సంస్థల జాతీయీకరణ వివాదంలో సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టడంతో 1964 ఫిబ్రవరి 29 న తనపదవికి రాజీనామా చేసారని గుర్తుచేశారు.
ఒక్క సారి ఎం.ఎల్.ఎ అయితే  కోట్లకి పడగలు ఎత్తే రాజకీయ వారసత్వాన్ని ప్రోత్సహిస్తున్న తరుణంలో వాటిని వ్యతిరేకించి ఎలాంటి హంగు ఆర్భాటాలకు పోకుండా నిస్వార్థ సేవలు అందించిన ప్రజా నాయకుడు నీలం సంజీవ రెడ్డి అని పేర్కొన్నారు. ముఖ్యంగా లోకసభాపతిగా ఎన్నిక కాగానే తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి అధికార పక్షంతో పాటు ప్రతి పక్షం మంచి వాతావరణం ఏర్పరచి స్పీకర్ పదవికే వన్నె తెచ్చిన రాయలసీమ రాజకీయ ఆణిముత్యం మన నీలం సంజీవరెడ్డి అని శైలజనాథ్ పేర్కొన్నారు.

ఘనంగా నీలం సంజీవరెడ్డి జయంతి వేడుకలు :
మాజీ రాష్ట్రపతి స్వర్గీయ నీలం సంజీవరెడ్డి  109వజయంతి వేడుకలు అనంతపురం జిల్లాలో ఘనంగా జరిగాయి . జయంతి వేడుకలు అనంతపురం నగరంలో శ్రీకంఠం సర్కిల్ సంజీవ రెడ్డి విగ్రహం వద్ద ఏ డి సి సి బ్యాంక్  మాజీ చైర్మన్ తరిమెల కోన రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా  తరిమెల కోనా రెడ్డి  సంజీవరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంజీవరెడ్డి రాష్ట్రపతి దాకా ఎన్నో కీలక పదవులు నిర్వహించిన ఆయన నీతి నిజాయితీకి  పారదర్శకతకు కట్టుబడిన వ్యక్తి అని కొనియాడారు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన రాజకీయంగా రాష్ట్రపతి పదవి దాకా  ఎదిగారని ఇది ఆయన రాజకీయ చతురతకు నిదర్శనం అన్నారు.  కరువుతో సతమతమవుతున్న రాయలసీమ జిల్లాలకు సాగు తాగునీరు అందించాలన్న ముందుచూపుతో ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు  ఈ కార్యక్రమంలో ఏ పీ ఎస్ ఐ డి సి మాజీ చైర్మన్ నల్లపురెడ్డి అయోధ్య హోటల్ యాజమాన్యం పెద్దిరెడ్డి, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు

Related Posts